సత్యదేవుడి ఆవిర్భావ వేడుకలు
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:09 AM
అన్నవరం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి 135వ ఆవి ర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు అనివేటి మండపంలో స్వామి,అమ్మవార్లను వెండి సింహాసనంపై ఆశీను లు గావించి పండితులు గణపతిపూజతో కార్యక్రమం ప్రారంభించా
ఘనంగా ప్రారంభం
నేడు ప్రత్యేక పూజలు
అన్నవరం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి 135వ ఆవి ర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు అనివేటి మండపంలో స్వామి,అమ్మవార్లను వెండి సింహాసనంపై ఆశీను లు గావించి పండితులు గణపతిపూజతో కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం రుత్విక్‌లకు దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్ రోహిత్ దీక్షావస్త్రాలను అందజేశారు. రుత్విక్‌వరుణలు జపములు, పారాయణలు, సూర్యనమస్కారములు, కలశస్థాపన గావించారు. సాయంత్రం 3.30కి అగ్నిప్రతిష్ఠాపన పవమాన హోమములు నిర్వహించారు. స్వామివారు శ్రావణ శుద్ధ విధి యరోజున రత్నగిరపై ఆవిర్భవించారు. దీనిలోభాగంగా శనివారం శ్రావణశుద్ధ విధియ సందర్భంగా వేకువజామున 2గంటలకు స్వామి,అమ్మవార్లకు సుప్రభాతసేవ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, పంచామృతాభిషేకములు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9గంటలకు ఆయుష్యహోమం ప్రారంభించి 11గంటలకు పూర్ణాహుతి గావిస్తారు. అనంతరం ఉదయం స్వామి, అమ్మవార్లకు వెండిరథంపై ప్రాకారసేవ, రాత్రికి గరుడవాహనంపై గ్రామసేవ జరుగుతుందని దేవస్థానం అధికారులు తెలిపారు.