జయ..జయ సత్యదేవా
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:48 AM
అన్నవరం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): జయ.. జయ సత్యదేవా నామస్మరణతో రత్నగిరి ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామివారి 135వ ఆవి ర్భావ దినోత్సవం పురస్కరించుకుని శనివారం ఆలయంలో విశేష కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున 2 గంటల కు స్వామి,అ
వేడుకగా స్వామివారి ఆవిర్భావ దినోత్సవం
పండితులకు ఘనంగా సత్కారం
అన్నవరం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): జయ.. జయ సత్యదేవా నామస్మరణతో రత్నగిరి ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామివారి 135వ ఆవి ర్భావ దినోత్సవం పురస్కరించుకుని శనివారం ఆలయంలో విశేష కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున 2 గంటల కు స్వామి,అమ్మవార్లను సుప్రభాతసేవతో మే ల్కొలిపి అభ్యంగనస్నానమాచరింపచేశారు. అనంతరం మూలవరులను పంచామృతాలతో అ భిషేకించారు. నవగ్రహమూల మంత్రములు, జ పములు, పారాయణలు అనంతరం చతుర్వేదపండితులు మహదాశీర్వచనాలు అందజేయగా అనివేటి మండపంలో హోమ పూర్ణాహుతి గావించారు. కార్యక్రమంలో చైర్మన్ ఐవీ రోహిత్, ఈవో వీర్ల సుబ్బారావు పాల్గొన్నారు. వారు పండితులను ఘనంగా సత్కరించారు. ఆరుగురు పండితులతో పాటుగా 12మంది రిటైర్డ్ వైదిక సిబ్బందిని పంచె, కండువా, నగదు పారితోషకం ఇచ్చి సన్మానించారు. అధికసంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో, చైర్మన్ పర్యవేక్షణ లో భక్తులకు ఏర్పాట్లు చేశారు. వర్షం కారణంగా స్వామివారి వెండిరథసేవను నిలుపుదల చేసి ఆ లయంలో పల్లకీలో ప్రాకారసేవ నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సత్యదేవా జూనియర్ కళాశాలలో సత్యదేవుడి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. స్వామివారి విశిష్టతను విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఘంటశాల వెంకట్ తెలిపారు.
మంత్రి అచ్చెన్న పూజలు
శనివారం సత్యదేవుడి సన్నిధిలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ ఈవో సుబ్బారావు, చైర్మన్ రోహిత్ ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందించగా చైర్మన్ స్వామివారి ప్రసాదం అందజేశారు.