సత్యదేవుడి హుండీల ఆదాయం రూ.1.55 కోట్లు
ABN , Publish Date - May 22 , 2025 | 12:26 AM
అన్నవరం, మే 21 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడికి భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా రూ.1,55,04, 639 నగదు, 48
అన్నవరం, మే 21 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడికి భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా రూ.1,55,04, 639 నగదు, 48 గ్రాముల బంగారం, 730 గ్రాముల వెండి సమకూరాయి. వీటితోపాటుగా యూఎస్‌ఏకు చెందిన 184 డా లర్లు, యుఏఈ 25 దిరహమ్స్, కెనడా 15తో పాటుగా పలుదేశాల కరెన్సీని భక్తులు హుండీలలో వేశారు. హుండీ లెక్కింపును ఈవో సుబ్బారావు, చైర్మన్ రోహిత్ పర్యవేక్షించగా సిబ్బం ది, సేవాసంస్థ సభ్యులు పాల్గొన్నారు. 26 రోజులకు ఈ ఆదాయం లభించగా సరాసరి రోజుకు రూ.5.96 లక్షలు భక్తులు హుండీలలో కానుకల రూపంలో సమర్పించారు.