గిరిప్రదక్షిణ విజయవంతం చేయాలి
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:09 AM
అన్నవరం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): కోరినకోర్కెలు తీర్చే భక్తవరదాయుడు అన్నవరం సత్యదేవుడికి ఈనెల 5న కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని గిరిప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరగనుంది. సుమారు 2లక్షల మంది భక్తులు కాళ్లకు
భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు
పరిశీలించిన అన్నవరం దేవస్థానం ఈవో, చైర్మన్
అన్నవరం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): కోరినకోర్కెలు తీర్చే భక్తవరదాయుడు అన్నవరం సత్యదేవుడికి ఈనెల 5న కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని గిరిప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరగనుంది. సుమారు 2లక్షల మంది భక్తులు కాళ్లకు చెప్పులు లేకుండా సుమారు 11.5 కిలోమీటర్ల మేర రత్న,సత్యగిరిలు చుట్టూ ఉదయం పల్లకీతో, మధ్యాహ్నం సత్యరఽథంతో తిరుగుతారు. వారికి అసౌకర్యం కలగకుండా చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్ రోహిత్ పరిశీలించారు. ఈ దారిలో వైద్యశిబిరాలు, భక్తులకు పంచిపెట్టేందుకు పళ్లు, మజ్జిగ వితరణ బిస్కట్ల పంపిణీ స్టాల్స్‌ను పరిశీలించారు. రోడ్డుపై ఎటు వంటి రాళ్లు లేకుండా రోలింగ్ చేయించాలని చైర్మన్ సూచించారు. భక్తులు మధ్యాహ్నం రెండు గంటలకు తొలిపావంచా వద్దకు చేరుకుని సత్యరథం వెంట గిరిప్రదక్షిణ చేసేలా విస్తృత ప్రచారం గావించాలని పీఆర్వో విభాగ అధికారులను ఆదేశించారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా స మన్వయంతో గిరిప్రదక్షిణను విజయవంతం చే యాలని కోరారు. వారివెంట ఇంజనీరింగ్, పీఆర్వో, విభాగ అధికారులతో పాటుగా ఏఈ వోలు, సూపరెంటెండెంట్‌లు పాల్గొన్నారు.