Share News

ఈవోకు మేమంటే చులకన!

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:14 AM

అన్నవరం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లాలోని అన్నవరం సత్యదేవుని ఆలయం ఇటీవల తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ప్రతిష్టను మసకబారుతుందనే ఫిర్యాదులతో దేవదాయ కమిషనర్‌ ఆదేశాలతో మంగళవారం అద నపు కమిషనర్‌ చంద్రకుమార్‌ విచారణ నిర్వహించారు. 90 శాతం ఉద్యోగులు ఈవో సుబ్బా రావు వ్యవహారశైలిపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈవో తమను చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. చంద్రకుమార్‌ ముందుగా కుటుంబసభ్యులతో సత్యదేవుడిని దర్శించుకుని అనం తరం ఆలయ ఏఈవోలు, సూపరెంటెండెంట్లు, ఇంజనీరింగ్‌ అధికారులతో ప్రకాష్‌సదన్‌ సమావే

ఈవోకు మేమంటే చులకన!
సమావేశానికి హాజరైన దేవస్థానం ఉద్యోగులు

ఆయన వ్యవహారశైలిపై

90 శాతం ఉద్యోగుల వ్యతిరేకత

ఈవో కుమారుడు పాలనా

వ్యవహారాల్లో తలదూర్చడంపై సీరియస్‌

అన్నవరం దేవస్థానం వివాదాలపై

దేవదాయ అదనపు కమిషనర్‌ విచారణ

అన్నవరం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లాలోని అన్నవరం సత్యదేవుని ఆలయం ఇటీవల తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ప్రతిష్టను మసకబారుతుందనే ఫిర్యాదులతో దేవదాయ కమిషనర్‌ ఆదేశాలతో మంగళవారం అద నపు కమిషనర్‌ చంద్రకుమార్‌ విచారణ నిర్వహించారు. 90 శాతం ఉద్యోగులు ఈవో సుబ్బా రావు వ్యవహారశైలిపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈవో తమను చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. చంద్రకుమార్‌ ముందుగా కుటుంబసభ్యులతో సత్యదేవుడిని దర్శించుకుని అనం తరం ఆలయ ఏఈవోలు, సూపరెంటెండెంట్లు, ఇంజనీరింగ్‌ అధికారులతో ప్రకాష్‌సదన్‌ సమావేశపు హాలులో సమావేశమయ్యారు. ముందుగా హాల్‌లో ఉన్న సీసీ కెమెరాలను ఆఫ్‌ చేయాలని చెప్పి విచారణ ప్రారంభించారు. ఇటీవల ఎందు కు ఆలయంలో వివాదాలు వస్తున్నాయని ప్రశ్ని ంచారు. దీంతో హాలులో నిశ్శబ్ధ వాతావరణం ఏర్పడింది. అనంతరం పరిస్థితిని ఒక సూపరింటెండెంట్‌, మరొక ఏఈవో ఈవో వ్యవహార శైలిపై ఏకరువు పెట్టారు. మరో ఏఈవో కలగజేసుకుని అందరి సమక్షంలో వివరాలు అడిగితే చెప్పలేరని తెలపడంతో ఎవరికి వారు లిఖితపూర్వకంగా రాయ ండి.. లేకుంటే ఒక్కొక్కరు వచ్చి వివరాలు అందించాలని చెప్పి పిలిచి వారి నుంచి వివరాలను చంద్రకుమార్‌ తీసుకోగా మరో అధికారి రికార్డు చేసుకున్నారు. సమావేశానికి హాజరైన ఉద్యో గుల్లో 90 శాతం మంది తమను ఈవో మానసికంగా కుంగదీయడమే కాకుండా చులకనగా చూస్తున్నారని, పాలనాపరమైన వ్యవహారాల్లో ఈవో కుమారుడు కలగజేసుకుని తమకు ఆదేశాలు ఇస్తున్నారని వాపోయారు. ఇటీవల వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ఉద్యో గులను ఎందుకు వీఆర్‌ఎస్‌ తీసుకుంటున్నారని ప్రశ్నించగా తమదైన శైలిలో వారు సమాధానమిచ్చారు. మరోక ఏఈవో దాదాపు 30ఏళ్లగా దేవదాయశాఖలో వివిధ ఆలయాల్లో వివిధ క్యాడర్లలో పనిచేశామని, అందరూ ఆదేశాలిచ్చి పనిచేయించుకునేవారని ఇక్కడ మాత్రమే పూచికపుల్లగా తీసిపారేస్తూ అందరి సమక్షంలో అవమానాలకు గురిచేశారని వివరించారు. అయితే విచారణ ప్రారంభానికి ముందే దేవదాయ కమిషనర్‌ కార్యాలయానికి కొన్ని ఆధారాలతో ఫిర్యాదులు అందించారు.

Updated Date - Apr 23 , 2025 | 12:14 AM