వేడుకగా సత్యదేవుడి చక్రస్నానం
ABN , Publish Date - May 13 , 2025 | 01:10 AM
అన్నవరం, మే 12 (ఆంధ్రజ్యోతి): కోరిన కోర్కెలు తీర్చే కలియుగదైవంగా పూజలందుకుంటున్న అన్నవరం సత్యదేవుడి దివ్యకల్యాణోత్సవాలలో భాగంగా సోమవారం పంపాసరోవరం వద్ద చక్రస్నానం కార్యక్రమం వేడుకగా జరిగింది. ఉదయం 9గంటలకు నవదంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను... పెళ్లిపెద్దలైన సీతారాములను మేళతాళాలు, పం డితుల వేదమం
నేడు శ్రీపుష్పయాగం
అన్నవరం, మే 12 (ఆంధ్రజ్యోతి): కోరిన కోర్కెలు తీర్చే కలియుగదైవంగా పూజలందుకుంటున్న అన్నవరం సత్యదేవుడి దివ్యకల్యాణోత్సవాలలో భాగంగా సోమవారం పంపాసరోవరం వద్ద చక్రస్నానం కార్యక్రమం వేడుకగా జరిగింది. ఉదయం 9గంటలకు నవదంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను... పెళ్లిపెద్దలైన సీతారాములను మేళతాళాలు, పం డితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ కొండపై నుంచి ఘాట్‌రోడ్డు గుండా పంపాతీరం వద్ద నున్న ప్రత్యేక వేదిక వద్దకు తోడ్కొనివచ్చారు. ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యం, చామర్తి కన్నబాబు, పాలంకి చినపట్టాభి ఆద్వర్యంలో ప్రత్యేకపూజలు నిర్వహించి అనంతరం పంపాసరోవరంలో స్వామి, అమ్మవార్లను, త్రి శూలం, సుదర్శనచక్రంలతో ముమ్మా రు స్నానమాచరింపచేశారు. తిరిగి వేదికవద్దకు తీసుకెళ్లి పూజలనంతరం చతుర్వేదపండితులు వేదాశీర్వచనా లందజేశారు. ఈ సందర్భంగా కంకణవిమోచన గావించారు. కార్యక్రమంలో ఈవో వీర్ల సుబ్బారావు చైర్మన్ ఐవీ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
ఉల్లాసంగా నాకబలి, దండియాడింపు
సాయంత్రం 4గంటలకు అనివేటి మండపం లో నాకబలి, దండియాడింపు కార్యక్రమాలు ఉ ల్లాసంగా జరిగాయి. అమ్మవారికి నల్లపూసలు గుచ్చి వసంతోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ముందుకుసాగారు. అర్చకస్వాములు స్వామి,అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎత్తుకుని నృత్యంచేశారు.
నేటితో ముగియనున్న కల్యాణోత్సవాలు
సత్యదేవుడికి శ్రీ విశ్వావసు నామసంవత్సర దివ్యకల్యాణోత్సవాలు మంగళవారం రాత్రికి జరి గే శ్రీపుష్పయాగంతో ముగియనున్నాయి. రాత్రి 8 గంటలకు స్వామివారి నిత్యకల్యాణమండపంలో ఈ వేడుకను నిర్వహిస్తారు. వివిధ సుగందభరిత పుష్పాలతో నవదంపతులను అర్చించి విశేషపదార్థాలను నివేదిస్తారు. అనంతరం దంపతీతాంబూలాలు అందించి మహిళలకు రవిక వస్త్రాలు బహూకరిస్తారు.