Share News

అన్నదాత సుఖీభవకు అర్హులను గుర్తించండి : కలెక్టర్‌

ABN , Publish Date - Aug 13 , 2025 | 01:54 AM

అన్నదాత సుఖీభవన, పీఎం కిసాన్‌ పథకానికి ఆధార్‌ మిస్‌ మ్యాచింగ్‌ క్రాస్‌ వెరిఫికేషన్‌ వంటి ఐదు రకాల అంశాల తనిఖీపై రెవెన్యూ వ్యవసాయశాఖ సిబ్బంది ప్రత్యేక చొరవచూపి అర్హులైన వారికి నిధులు విడుదలకు కృషి చేయాలని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ ఆదేశించారు.

అన్నదాత సుఖీభవకు అర్హులను గుర్తించండి : కలెక్టర్‌

అమలాపురం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవన, పీఎం కిసాన్‌ పథకానికి ఆధార్‌ మిస్‌ మ్యాచింగ్‌ క్రాస్‌ వెరిఫికేషన్‌ వంటి ఐదు రకాల అంశాల తనిఖీపై రెవెన్యూ వ్యవసాయశాఖ సిబ్బంది ప్రత్యేక చొరవచూపి అర్హులైన వారికి నిధులు విడుదలకు కృషి చేయాలని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ ఆదేశించారు. అమరావతి నుంచి భూపరిపాలన ముఖ్య కమిషనర్‌ జయలక్ష్మి, కార్యదర్శి ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి అన్నదాత సుఖీభవ పథకంపై దిశానిర్దేశం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల రికార్డుల్లో వివరాలు, విచారణ పంపిణీకి సన్నద్ధతత, కులధ్రువీకరణ పత్రాలు, సుమోటాగా ధ్రువీకరణ, రెగ్యులర్‌ విచారణ ప్రక్రియలో పురోగతిపై కలెక్టర్లతో సమీక్షించారు. జేసీ నిషాంతి, డీఆర్వో కె.మాధవి, ఆర్డీవోలు శ్రీకర్‌, డి.అఖిల, వ్యవసాయాధికారి బోసుబాబు, సర్వేఏడీ కె.ప్రభాకర్‌ పాల్గొన్నారు.

గడువులోగా లక్ష్యాల్ని ఛేదించాలి..

ప్రభుత్వం ప్రాధాన్యత అంశాల లక్ష్యాల సాధనలో జిల్లాస్థాయి అధికారులు కీలకంగా పనిచేసి గడువులోగా వాటిని పూర్తి చేయాలని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, రెవెన్యూ అధికారులు, మండల సర్వేయర్లు, ఇతర సిబ్బందితో పలు అంశాలపై సమీక్షించారు. షెడ్యూల్డు కులాల వారికి బరియల్‌ గ్రౌండ్ల కోసం స్థల సేకరణ, మండలాల వారీగా పట్టాదారు పాసు పుస్తకాల తనిఖీ, పత్రాలు లేని గ్రామ సర్వీసు ఈనాం భూములను సబ్‌రిజిస్ర్టార్‌ భూ రికార్డుల్లో 20 ఏళ్ల వ్యవధిలో సరిపోల్చి హక్కులను గుర్తించాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్వో కె.మాధవి, ఆర్డీవోలు శ్రీకర్‌, డి.అఖిల, పలు మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 01:54 AM