నేడు సత్యదేవుడి ఉత్తరద్వార దర్శనం
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:01 AM
అన్నవరం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని మంగళవారం రత్నగిరివాసుడు సత్యదేవుడు ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉత్తరద్వారాన్ని స ర్వాంగ సుందరంగా వివిధ సుగందభరిత పు ష్పాలతో అలంకరించారు. ప్రము
ఉదయం 5 నుంచి సాయంత్రం
5 గంటల వరకు దర్శనభాగ్యం
సర్వాంగ సుందరంగా ఆలయం
అన్నవరం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని మంగళవారం రత్నగిరివాసుడు సత్యదేవుడు ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉత్తరద్వారాన్ని స ర్వాంగ సుందరంగా వివిధ సుగందభరిత పు ష్పాలతో అలంకరించారు. ప్రముఖులు, సామాన్యులకు ఏ ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో త్రినాథరావు, చైర్మన్ రోహిత్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వేకువజామున 4గంటలకు సుప్రభాతసేవ అనంతరం ము క్కోటి ఏకాదశి పూజలు, తర్వాత ఉదయం 5 గం టలకు ఉత్తరద్వార దర్శనానికి భక్తులను అను మతిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దర్శనం కొనసాగుతుంది. ప్రధానాలయం వద్ద ఏకకాలంలో మూలవరులతో పాటు ఉత్తరద్వారంలో శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మి అలంకరణలో ఉన్న ఉత్సవమూర్తులను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు కదంబం ప్రసాదం వితరణ చేపట్టి 11గంటలకు కొండపై స్వామి, అమ్మవార్లకు వెండి రథ సేవ నిర్వహిస్తారు.