‘అన్నవరం’లో ఆరుగురు వ్రతపురోహితుల తొలగింపు
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:03 AM
అన్నవరం, డిసెంబరు 22 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో వ్రతవిభాగంలో విధులు నిర్వహిస్తు న్న ఆరుగురు వ్రత పురోహితులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ ఈవో త్రినాథరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 21న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సిఫార
గుమాస్తాకు షోకాజు నోటీసులు
దానాల పేరుతో భక్తులను డబ్బులు డిమాండ్ చేయడమే కారణం
అన్నవరం, డిసెంబరు 22 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో వ్రతవిభాగంలో విధులు నిర్వహిస్తు న్న ఆరుగురు వ్రత పురోహితులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ ఈవో త్రినాథరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 21న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సిఫారస్‌తో పాలకొల్లులో నిర్వహించిన ఉచిత సామూహిక వ్రతాల్లో భక్తుల నుంచి దానాల పేరుతో డబ్బులు డిమాండ్ చేశారనే అభి యోగాలు రుజువుకావడంతో ఈనిర్ణయం తీసుకున్నారు. స్పెషల్ గ్రేడ్ వ్రతపురోహితులు మంథా శ్రీరామ్మూర్తి, ప్రయాగ ఆంజనేయులు, తొయ్యేటి వెంకట నరసింహ హరినాథ సుబ్రహ్మణ్యం, సెకండ్‌గ్రేడ్ పురోహితులు పాలంకి సోమేశ్వరరావు, మల్లాది గురుమూర్తి, మూడోగ్రేడ్ పురోహితులు మెకరాల సతీష్‌పై తాత్కాలిక తొలగింపు చర్యలు తీసుకున్నారు. రూ.1000 వ్రత గుమాస్తా బీ.రాజుకు షోకాజు నోటీసులిచ్చారు.