Share News

మూగజీవాల రోధన

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:44 AM

మూగజీవాల రోదన ఎవరికి పడుతుంది.. సమస్య ఉన్నా పట్టదు.. తెలిసినా పట్టించు కోరు..మూగజీవాలు మాత్రం ప్రాణాలతో పోరా డుతున్నాయి.

మూగజీవాల రోధన
మురమండ పశువుల ఆసుపత్రి

మురమండలో దారుణం

20 పశువులు మృత్యువాత

పశు వైద్యులను నియమించాలి

కడియం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : మూగజీవాల రోదన ఎవరికి పడుతుంది.. సమస్య ఉన్నా పట్టదు.. తెలిసినా పట్టించు కోరు..మూగజీవాలు మాత్రం ప్రాణాలతో పోరా డుతున్నాయి. వ్యవసాయాధారిత జిల్లా కావ డంతో ప్రతి ఇంటా పాడిపంట కామన్‌.. అయితే జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాల్లో పశు వైద్యులు లేక రైతాంగం కొట్టుమిట్టాడుతు న్నారు. పశువులైతే రోగాలకు తాళలేక మౌనం గా రోదిస్తున్నాయి. ఉదాహరణకు పాడిపరిశ్రమకు అధికంగా ఉండే మురమండ గ్రామంలో ప్రభుత్వ పశువైద్యశాలకు శాశ్వత పశువైధ్యాధికారి లేరు.దీంతో గ్రామంలో పాడిరైతులు ఏలే టి శ్రీనివాస్‌కు చెందిన ఆవు, ఈదల శ్రీనివాస్‌కు చెందిన గేదె, పాడి రైతులు పుట్టా నారా యణరావు, పిల్లా అన్నవరం, సుంకర రాజుకు చెందిన పాడిదూడలు ఇలా సుమారు 20 పశువులు మృత్యువాత పడ్డాయి. ముర మండ తో పాటు మాధవరాయుడుపాలెం,దుళ్ళ, గ్రామ శివారుల్లో మురమండ గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో పాడిపెంపకం చేసే రైతులు పశువులను వైద్యం నిమి త్తం ఆస్పత్రికి తీసుకొస్తారు. పశువులకు ఏదై నా సుస్తీ చేస్తే కొంత కాలంగా జేగురుపాడు పశువైద్యులు వచ్చి వైద్యసేవలందిస్తున్నారన్నా రు.అటు జేగురుపాడు..ఇటు మురమండ వచ్చి పశువులకు వైద్యం అందించంతో సేవలు ఆల స్యమవుతున్నాయి.శాశ్వత వైద్యుడిని నియమించాలని రైతులు కోరుతున్నారు.

పశువైద్యుడు లేక ఇబ్బంది..

కొంత కాలంగా మురమండ పశువుల ఆస్ప్రతికి వైద్యుడు లేరు. గతంలో పశువైద్యులు, మరో ఇద్దరు సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం కేవలం ఒక వెటర్నరీ అసిస్టెంట్‌ ఉన్నారు. జేగురుపాడు పశువైద్యుడే సేవలందిస్తు న్నారు. వెంటనే పశువైద్యుడిని నియమించాలి. - మరిడి సత్యనారాయణ, రాష్ట్ర ఉత్తమ పాడిరైతు, మురమండ

Updated Date - Apr 18 , 2025 | 12:44 AM