ఇద్దరు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:45 AM
నిడదవోలు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఏటీఎ ంలో నగదు చోరీకి ప్రయత్నించిన అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేయడం ద్వారా 7 కేసులు ఛేదించినట్టు సీఐ పీవీజీ తిలక్ తెలిపారు. తూ ర్పుగోదావరి జిల్లా నిడదవోలు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 14న
నిందితులపై 30 పాత కేసులు
సీఐ తిలక్
నిడదవోలు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఏటీఎ ంలో నగదు చోరీకి ప్రయత్నించిన అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేయడం ద్వారా 7 కేసులు ఛేదించినట్టు సీఐ పీవీజీ తిలక్ తెలిపారు. తూ ర్పుగోదావరి జిల్లా నిడదవోలు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 14న నిడద వోలు మండలం తాడిమళ్ల గ్రామంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో నగదు చోరీకి ప్రయత్నం జరిగింది. నిడదవోలుకు చెందిన కోలా అభిషేక్, కోనసీమ జిల్లాకు చెందిన గుద్దటి రాజు ఈ చోరీకి ప్రయత్నించగా వారిని అరెస్ట్ చేశారు. పెందుర్తిలో 2, పాడేరులో 1, వి. మాడు గలలో 1, మండపేట రూరల్‌లో 1, రాజా నగరం లో 1, సమిశ్రగూడెంలో 1 మొత్తం 7 నేరా లు ఈ ఇద్దరు కలిసి చేసినట్టు తమ దర్యాప్తులో వెల్ల డైందని సీఐ తెలిపారు. నిందితులపై సుమారు 30 పాత కేసులు ఉన్నాయని, చిన్నతనం నుంచి చెడు వ్యసనాలకు లోనై దొంగతనాలు చేస్తున్న ట్టు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐలు బాలాజీ సుందరరావు, జగన్ మోహనరావు పాల్గొన్నారు.