సులభంగా డబ్బు సంపాదనకు దొంగతనాలు
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:37 AM
రాజోలు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.11,58,500 విలువచేసే 64 గ్రాముల బంగారం, 2కిలోల 859 గ్రాముల వెండి, రూ.2లక్షల 80వేల నగదును స్వాధీనం చేసుకున్నామని రాజోలు సీఐ టీవీ నరేష్‌కుమార్, అమలాపురం క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్ తెలిపారు. రాజోలు పోలీసుస్టేషన్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో వారు నిందితుల వివరాలు వెల్లడిం
అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
రూ.11,58,500 విలువచేసే ఆభరణాలు,
రూ.2.80 లక్షల నగదు స్వాధీనం
రాజోలు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.11,58,500 విలువచేసే 64 గ్రాముల బంగారం, 2కిలోల 859 గ్రాముల వెండి, రూ.2లక్షల 80వేల నగదును స్వాధీనం చేసుకున్నామని రాజోలు సీఐ టీవీ నరేష్‌కుమార్, అమలాపురం క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్ తెలిపారు. రాజోలు పోలీసుస్టేషన్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో వారు నిందితుల వివరాలు వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం బి.సావరానికి చెందిన కె.అర్జున్ డిగ్రీ వరకు చదివి ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. మద్యానికి అలవాటు పడి సరైన సంపాదన లేక సులభంగా డబ్బు సంపాదించాలని దొంగతనాలు ప్రా రంభించాడు. అర్జున్‌పై కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో పదికి పైగా దొంతనాల కేసులు ఉన్నాయి. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం గొల్లగూడెనికి చెందిన ఎస్.మంగప్రసాద్ వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన షేక్ బాషీ వెండి పట్టీలు తయారుచేస్తూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడిపై మారేడుమిల్లి పోలీసుస్టేషన్‌లో గంజాయి రవాణా చేసినందుకు కేసు నమోదైంది. కాకినాడకు చెందిన షేక్ అజీజ్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. అయితే ఈ నలుగురు మద్యం, విలాసాలకు అలవాటు పడి వచ్చే ఆదాయం సరిపోక సులభంగా డబ్బు సంపాదించాలని దొంగతనాలు చేశారు. ఈ నలుగురిని రాజోలు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కోనసీమ జిల్లా ఎస్పీ బీవీ కృష్ణారావు ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ ఎస్.మురళీమోహన్ ఆధ్వర్యంలో రాజోలు సీఐ టీవీనరేష్‌కుమార్, అమలాపురం క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్, సిబ్బంది, రాజోలు ఎస్‌ఐ బి.రాజేష్‌కుమార్, సిబ్బంది నిందితులను పట్టుకు న్నారు. ముగ్గురిని రాజోలు మ ండలం బి.సావరంలో, ఒకరిని కాకినాడలో అరెస్టు చేశామని తెలిపారు. నిందితులకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో పరిచ యడం ఏర్పడిందని, తర్వాత ముఠాగా ఏర్పడి దొంగత నాలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితులను రాజోలు కోర్టులో హాజరుపరుచగా రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ నరేష్‌కుమార్, క్రైమ్ ఎస్‌ఐ గజేంద్రకుమార్, ఎస్‌ఐ పరదేశీ, ఏఎస్‌ఐ బాలకృష్ణ, ఎస్‌ఐ బి.రాజేష్‌కుమార్, క్రైమ్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.