Share News

జైల్లో పరిచయం.. నిత్యం దొంగతనాలు

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:10 AM

నల్లజర్ల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): దేశం లో పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడు తున్న అంతర్‌ రాష్ట్ర ముఠాను అరెస్ట్‌ చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌ తెలిపారు. శని వారం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పోలీస్‌ స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో ఆరుగురు దొంగలను ప్రవేశపెట్టారు. వారి నుంచి రూ.3 లక్షల న

జైల్లో పరిచయం.. నిత్యం దొంగతనాలు
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌

నల్లజర్లలో అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

నల్లజర్ల, ప్రతిపాడు, తణుకులో చోరీలు చేసినట్టు గుర్తింపు

ఒక్కొక్కరిపై 15 నుంచి 20 కేసులు

రూ.3 లక్షల నగదు, బంగారం, రెండు బైక్‌ల స్వాధీనం

నల్లజర్ల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): దేశం లో పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడు తున్న అంతర్‌ రాష్ట్ర ముఠాను అరెస్ట్‌ చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌ తెలిపారు. శని వారం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పోలీస్‌ స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో ఆరుగురు దొంగలను ప్రవేశపెట్టారు. వారి నుంచి రూ.3 లక్షల నగదు, బంగారం చైన్‌, 2 గాజులు, కారు, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

నెల్లూరుకు చెందిన షేక్‌ఫక్రుద్దీన్‌ ఒంగోలు జైలులో ఉన్నప్పుడు మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెంది న కేసు ఉమ్రో మోహదా (హోలిటేడా పంచా యతీ, గంధవాన్‌ మండలం, ధార్‌ జిల్లా) రాగన్‌ మధవ్‌ హటిలా, బారిక్‌సింగ్‌ ఆజీనార్‌, ముహరు కల్లు మహదా, హీరు హరియా అజీనార్‌తో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలైన తరు వాత ఏపీలో సంపన్నులు ఉంటారని, చోరీలు చేద్దామనుకుని నిర్ణయించుకున్నారు. దీంతో సెప్టెంబరు 24వ తేదీ అర్ధరాత్రి తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఒంటరిగా నివసిస్తున్న పాకల పాటి సుభధ్ర ఇంటి తలుపులు పగుల గొట్టి ఆమె మెడలోని బంగారు అభరణాలను దోచుకుపోయారు. అంతకుముందు కాకినాడ జిల్లా ప్రత్తి పాడులోని సురేష్‌ జ్యూయలరీ షాపులో 11 కిలోల వెండి, బైక్‌ దొంగతనం చేశారు. తర్వాత నల్లజర్లకు 2బైక్‌లు, కారుతో వచ్చి ఇక్కడ కూడా చోరీకి పాల్పడ్డారు. ఆ తర్వాత ఖమ్మం వెళ్లి అక్క డి నుంచి మధ్యప్రదేశ్‌కు రైలులో పారి పోయా రు. తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ నరసింహ కిషో ర్‌ ఆదేశాల మేరకు కొవ్వూరు డీఎస్పీ దేవకుమా ర్‌ పర్యవేక్షణలో కొవ్వూరు రూరల్‌ సీఐ విజయ బాబు, దేవరపల్లి సీఐ నాయక్‌ ఆఽధ్వర్యంలో 2బృందాలు మధ్యప్రదేశ్‌ వెళ్లి గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఫక్రుద్దీన్‌ కదలి కలపై నిఘాపెట్టారు. ఎట్టకేలకు శుక్రవారం మధ్యాహ్నం నల్లజర్లలో పోతవరం కుడి కాల్వ గట్టుపై అనుమానాస్పదంగా కొంతమంది తిరు గుతున్నట్టు నల్లజర్ల సీఐ రాంబాబుకు సమాచా రం రావడంతో సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. వి చారణ అనంతరం అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా గా నిర్ధారించుకుని వారి వద్ద నుంచి సొత్తును రికవరీ చేశారు. కష్టపడి పనిచేసిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. వీరిని ధార్‌ ముఠాగా పిలుస్తారని, మధ్యప్రదేశ్‌లోని 4 గ్రామాల్లో కలిసి ఉంటూ నిత్యం దొంగతనాలు చేయడం, పోలీసు లు వెళితే వారిపై దాడులకు పాల్పడడం, అవస రమైతే చంపేయడం వంటివి చేస్తారని డీఎస్పీ పేర్కొన్నారు. వీరు గతంలో పోలీసు అధికారుల పై ఫైర్‌ ఓపెన్‌ చేయడం జరిగిందన్నారు. తణు కులో కూడా చోరీ చేసినట్టు గుర్తించారు. ఒక్కొ క్కరిపై 15 నుంచి 20 కేసులు ఉన్నాయని తెలి పారు. సమావేశంలో సీఐలు నాయక్‌, రాంబా బు, ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 12:10 AM