Share News

జలామృత్‌!

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:21 AM

పట్టణాలు,నగరాల్లో తాగునీటి సరఫరా మెరుగుదల, మురుగునీటి శుద్ధి ప్రాజెక్టుల నిర్వహణ కు పుష్కలంగా నిధులు విడుదలయ్యాయి.

జలామృత్‌!

తీరనున్న తాగునీటి వెతలు

పట్టణాల్లో ప్రాజెక్టులకు మోక్షం

ఉమ్మడి జిల్లాకు రూ.867 కోట్లు

అమృత్‌ 2.0 పథకంలో మంజూరు

చామ్‌ మోడల్‌లో పనులు

వైసీపీలో నిధులు మళ్లింపు

మూడు నెలల్లో టెండర్ల పిలుపు

(పిఠాపురం-ఆంధ్రజ్యోతి)

పట్టణాలు,నగరాల్లో తాగునీటి సరఫరా మెరుగుదల, మురుగునీటి శుద్ధి ప్రాజెక్టుల నిర్వహణ కు పుష్కలంగా నిధులు విడుదలయ్యాయి. కేం ద్రం అమృత్‌-2.0 పథకం ద్వారా ఇచ్చిన నిధులు సద్వినియోగపరచుకుంటూ రాష్ట్ర వాటా విడు దల చేస్తూ పనులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక సంస్థల వాటా విడుదల చేయకపోవడంతో పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వీటన్నింటికి తిరిగి అం చనాలు రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉ మ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రూ.867.73 కోట్లు నిధులు మంజూరు చేయడంతో మూడు నెలల్లోగా టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

అసలేం చేస్తారు..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తాగునీటి సరఫరా వ్యవస్థ పురాతనమైనది. దీంతో నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు చోట్ల ప్రస్తుతం ఉన్న తాగునీటి ప్రాజెక్టుల కెపాసిటీ సరిపోవడం లేదు. పెరిగిన జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా వ్యవస్థను ఆధునీకరించడం, పైపులైన్ల ఏర్పాటుతో పాటు మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులు, కొత్తగా మురుగునీటి పారుదల నెట్‌వర్క్‌ల ఏర్పాటుకు కేం ద్రం అమృత్‌ పథకం ద్వారా నిధులు కేటాయిస్తోంది.ఇందులో కేంద్రంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చడంతో పాటు ఈ ప్రాజెక్టులు అమలయ్యే పట్టణ స్థానిక సంస్థలు తమ వాటా భరించాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది.

వైసీపీలో ఎక్కడివి అక్కడే..

వైసీపీ ప్రభుత్వం అమృత్‌-2.0 పథకం నిధులు వినియోగించుకోవడంలో పూర్తిగా విఫల మైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమృత్‌ నిధులు కేంద్రం మంజూరు చేసింది. దీంతో పట్టణాలు,నగరాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి వీలు ఏర్పడుతుందని భావించారు. అ యితే రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు పూర్తిస్థాయిలో విడుదల చేయకపోగా కేంద్రం ఇచ్చిన నిధులు ఇతర అవసరాలకు దారి మళ్లించారు. మంజూరైన పనుల్లో కొన్నింటిని మా త్రమే ప్రా రంభించారు.వాటికి పూర్తిస్థాయిలో నిధులు వి డుదల కాకపోవడం,స్థానిక సంస్థల నిధులను అప్పటి వైసీపీ ప్రభుత్వం తన ఆధీనంలో ఉం చుకోవడంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. మెజార్టీ పనులు ప్రారంభమే కాలేదు.

కూటమి ప్రభుత్వం దృష్టి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమృత్‌-2.0 పథకం నిధులు వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్రంతో సంప్రదింపులు జరిపి తమ వాటా విడుదలకు అంగీకారం తెలపడంతో నిధులు మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, ఎనిమిది మునిసిపాలిటీలు,మూడు నగరపంచాయతీలకు 867.73 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ వాటర్‌ యా క్షన్‌ ప్లాన్‌ ట్రెంచ్‌ 1,2 ద్వారా కన్సెషనరీ హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌(చామ్‌)లో నిర్వహించేందుకు ఆదేశాలివ్వడంతో అన్ని పనులు మూడు నెలల్లోగా ప్రారంభించాలని ఆదేశించింది. పనులు 24 నెలల్లోపు పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్థేశించింది.ఈ పనులు పూర్తయితే పట్టణాలు, నగరాల్లో తాగునీటి సరఫరా మెరుగుపడి..ప్రజలకు తాగునీరందుతుందని భావిస్తున్నారు.

కాకినాడకు రూ.498.16 కోట్లు

కాకినాడ జిల్లాకు రూ. 498.16 కోట్లు విడుదలయ్యాయి. పిఠాపురం పట్టణంలో తాగునీటి సరఫరా మెరుగుదల ప్రాజెక్టుకు రూ.57.37 కోట్లు, పెద్దాపురం పట్టణ పరిధిలో నీటి సరఫరా ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టుకు రూ. 36.21 కోట్లు, తిరుపతిరాజు చెరువు ఆధునీకరణకు రూ.61 లక్షలు, పాత ఆర్టీసీ కాం పెక్స్‌ సమీపంలోని పెద్ద చెరువు ఆధునీకరణకు రూ.90 లక్షలు, సామర్లకోట పట్టణ పరిధిలో తాగునీటి సరఫరా ఇంప్రూవ్‌మెంట్‌ పథకానికి రూ. 38.98 కోట్లు, గొల్లప్రోలు పట్టణంలో ఆర్థికంగా వెనుకబడిన కాలనీల తాగునీటి సరఫరా పథకానికి రూ. 2.16 కోట్లు, మంచినీటి చెరువు అభివృద్ధికి రూ.4.10 కోట్లు, తుని పట్టణంలో వాటర్‌ సప్లై ఇంప్రూవ్‌మెంట్‌ పథకానికి రూ.15.04 కోట్లు, ఏలేశ్వరం నగరపంచాయతీలో కప్పలచెరువు ఆ ధునీకరణకు రూ.74 లక్షలు మం జూరయ్యాయి. కాకినాడ నగరంలో తాగునీటి సరఫరా మెరుగుదల ప్రాజెక్టుకు రూ. 256.48 కోట్లు మంజూరు కాగా, నగర పరిధిలో మురుగునీటి పారుదల నిర్వహణకు రూ.82.87 కోట్లు, బోట్‌క్లబ్‌ పార్కు ఆధునీకరణకు రూ.2.70కోట్లు విడుదల చేశారు.

తూర్పునకు రూ. 296.83 కోట్లు

రాజమహేంద్రవరం,నిడదవోలు మునిసిపాలిటీలకు రూ.296. 83 కోట్లు మంజూరయ్యాయి.రాజమహేంద్రవరంలో మురుగునీటి పారుదలకు రూ.92.78 కోట్లు, వాటర్‌ సప్లై ఇంప్రూవ్‌మెంట్‌ స్కీమ్‌కు రూ.95.14 కోట్లు, కంబాలచెరువు ఆధునీకరణకు రూ.3.70 కోట్లు,గంటాలమ్మ చెరువు ఆధునీకరణకు రూ.కో టి,గోదావరి వద్ద పనులకు రూ.7.20 కోట్లు, ఆర్యాపురం ట్యాంకు ఆధునీకరణకు రూ.3.20 కోట్లు విడుదలయ్యాయి. నిడదవోలుకు ధవళేశ్వరం నుంచి గోదావరి జలాల సరఫరాకు రూ.83.82 కోట్లు, నిడదవోలు వీకర్‌ సెక్షన్‌ కాలనీ తాగునీటి సరఫరాకు రూ5.96 కోట్లు, మలకోడు చెరువుకు రూ.93 లక్షలు,వేస్ట్‌ వాటర్‌ ట్యాంకు ఆధునీకరణకు రూ. 3.60 కోట్లు మంజూరు చేశారు.

కోనసీమకు రూ.72 కోట్లు

కోనసీమ జిల్లాకు రూ.72.74 కోట్లు కే టాయించారు.అమలాపురం వాటర్‌ సప్లై ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టుకు రూ. 11.51 కోట్లు, రామచంద్రపురం తాగునీటి సరఫరా మెరుగుదల ప్రాజెక్టుకు రూ.15.20 కోట్లు, రామచంద్రపురంలో చెరువు ఆధునీకరణకు రూ.1.10 కోట్లు,మండపేట వాటర్‌ సప్లై ఇంప్రూ వ్‌మెంట్‌ ప్రాజెక్టుకు రూ.29.02 కోట్లు, ముమ్మిడివరంలో తాగునీటి సరఫరా మె రుగుదలకు రూ.15.91 కోట్లు మం జూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

Updated Date - Jun 17 , 2025 | 12:21 AM