Share News

అంబేడ్కర్‌ బాటలో పయనించాలి

ABN , Publish Date - May 25 , 2025 | 01:55 AM

అందరూ అంబేడ్కర్‌ చూపిన బాటలో పయనించాలని అంబేడ్కర్‌ మనుమడు యశ్వంత్‌బీమారావు అంబేడ్కర్‌ విజ్ఞప్తి చేశారు.

అంబేడ్కర్‌ బాటలో పయనించాలి
అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న యశ్వంత్‌ బీమారావు అంబేడ్కర్‌

కాట్రేనికోన, మే 24(ఆంధ్రజ్యోతి): అందరూ అంబేడ్కర్‌ చూపిన బాటలో పయనించాలని అంబేడ్కర్‌ మనుమడు యశ్వంత్‌బీమారావు అంబేడ్కర్‌ విజ్ఞప్తి చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోన సీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకుర్రు బస్టాండ్‌లో అంబేడ్కర్‌ విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని భూపతిరాజు శివకుమార్‌వర్మ (గబ్బర్‌సింగ్‌) అందించారు. జిల్లాలోనే కూర్చుని ఉన్న విధంగా నిర్మించిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ప్రపంచ దేశాల్లో అంబేడ్కర్‌ను ప్రపంచ మేధావిగా గుర్తిస్తుంటే, ఇక్కడ మాత్రం అంబేడ్కర్‌ విగ్రహాలకు అవమానాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ కల్పించిన ఓటుహక్కును వినియోగించుకుని అట్టడుగు వర్గాల ప్రజలు రాజ్యాధికారం వైపు పయనించాలన్నారు. అనంతరం పలువురు కళాకారులు అంబేడ్కర్‌ పాటలతో జనాన్ని ఉత్తేజపరిచారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, విగ్రహదాత గబ్బర్‌సింగ్‌ యశ్వంత్‌బీమారావు అంబేడ్కర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, మాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చెల్లి అశోక్‌, నాగిడి నాగేశ్వరరావు, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, ఆర్పీఐ నాయకులు డీబీ లోక్‌, ఇసుకపట్ల రవిబాబు, సర్పంచ్‌ నాతి అలివేణి, యువజన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 01:55 AM