ఉమ్మడి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:07 AM
కలెక్టరేట్ (కాకినాడ), ఏప్రిల్ 15 (ఆంధ జ్యోతి): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేయాలని అమరా వతి ప్రణాళిక విభాగం సీనియర్ సలహాదారు డీవీవీ సీతాపతిరావు సూచించారు. కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమి సమావేశ మందిరం లో మంగ

అమరావతి ప్రణాళిక విభాగం సలహాదారు సీతాపతిరావు
కాకినాడలో ప్రత్యేక అధికారులకు వర్క్ షాప్
కలెక్టరేట్ (కాకినాడ), ఏప్రిల్ 15 (ఆంధ జ్యోతి): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేయాలని అమరా వతి ప్రణాళిక విభాగం సీనియర్ సలహాదారు డీవీవీ సీతాపతిరావు సూచించారు. కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమి సమావేశ మందిరం లో మంగళవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజ వర్గాల ప్రత్యేక అధికారులు, ప్రణాళిక యూనిట్ సభ్యులకు వర్క్ షాప్ నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ని యోజకవర్గంలో వ్యవసాయం, పారిశ్రామిక రం గం, సేవారంగాలు ఎలా అభివృద్ధి చేయవచ్చో తెలిపే విధంగా యాక్షన్ ప్లాన్ తయారుచేయా లన్నారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొక్క ప్రత్యేక అధికారులకు అనుబంధంగా ఐదుగురు సచివాలయంసిబ్బంది పనిచేస్తారన్నా రు. నియోజకవర్గాల్లో ఉన్న అవకాశాలను అను సరించి వ్యవసాయం, పారిశ్రామికరంగం, సేవా రంగాల అభివృద్ధి చెందే విధంగా ప్లాన్ రూప కల్పన చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయంతో నియో జకవర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. 3జిల్లాల అర్థగణా ంక అధికారులు త్రినాధ్, అప్పల కొండ, వెంకటే శ్వర్లు, జడ్పీసీఈవో లక్ష్మణరావు పాల్గొన్నారు.