Share News

పొంగి పొర్లిన ‘అలుగువాగు’

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:51 PM

ఎటపాక, ఆగస్టు 16 (ఆంధ్ర జ్యోతి): గత ఐదు రోజులుగా కురు స్తున్న వర్షాలతో ఎగువప్రాంతం నుంచి వరదనీరు వచ్చి చేరడంతో అలుగువాగు ప్రాజెక్టు పొంగి

పొంగి పొర్లిన ‘అలుగువాగు’

ఎటపాక, ఆగస్టు 16 (ఆంధ్ర జ్యోతి): గత ఐదు రోజులుగా కురు స్తున్న వర్షాలతో ఎగువప్రాంతం నుంచి వరదనీరు వచ్చి చేరడంతో అలుగువాగు ప్రాజెక్టు పొంగి పొర్లింది. అల్లూరి జిల్లా ఎటపాక మండ లం అచ్చుతాపురం గ్రామం వద్ద ఉన్న అలుగువాగు ప్రాజెక్టు శనివారం వరదనీటి ప్రవాహంతో ఉధృతంగా ప్రవహించింది. దీంతో వరదనీరు కుడి, ఎడమ కాల్వల నుంచి వాగుల్లోకి ప్రవహించింది. ఈఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో ఇప్పటివరకు ప్రాజెక్టు నిండ లేదు. ఇటీవల వర్షాలకు ప్రాజక్టుకు జలకళ సంతరించుకుంది. ఇదిలా ఉంటే ప్రాజెక్టు దిగువన గిరిజనులు చేపలవేటను సాగించారు.

Updated Date - Aug 16 , 2025 | 11:51 PM