ఘంటావారిగూడెంలో అశ్లీల నృత్యాలు, మద్యం పార్టీ
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:10 AM
నల్లజర్ల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటవారి గూడెం శివారు గుణ్ణం సురేష్ కొబ్బరితోటలో మంగళవారం రాత్రి 25 మంది పురుషులు, ముగ్గురు యువతులతో కలసి అశ్లీల నృత్యం చేస్తుండగా నల్లజర్ల సీఐ బాలశౌరి తన బృందం తో దాడి చేసి వారిని అరెస్ట్ చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. బుధవారం నల్లజర్ల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. ఉం గుటూరు
పోలీసుల దాడి
25 మంది పురుషులు, ముగ్గురు యువతులు అరెస్ట్
నల్లజర్ల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటవారి గూడెం శివారు గుణ్ణం సురేష్ కొబ్బరితోటలో మంగళవారం రాత్రి 25 మంది పురుషులు, ముగ్గురు యువతులతో కలసి అశ్లీల నృత్యం చేస్తుండగా నల్లజర్ల సీఐ బాలశౌరి తన బృందం తో దాడి చేసి వారిని అరెస్ట్ చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. బుధవారం నల్లజర్ల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. ఉం గుటూరు మండలం నారాయణపురం గ్రామా నికి చెందిన గుణ్ణం సురేష్, వెజ్జు వెంకట దుర్గా సుబ్బారావు, ఆగసిస్త నాగ వెంకట దుర్గాప్రసాద్, కిలపర్తి దుర్గాశ్రీనివాస్ మరో 21మంది, తాడేపల్లి గూడెం, రాజమహేంద్రవరం ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులతో కలిపి గుణ్ణం సురేష్ పుట్టినరోజు సందర్భంగా కొబ్బరితోటలో పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తోటలో ‘యు’ ఆకారం లో టేబుల్స్ వేసుకుని పురుషులు మద్యం సేవిస్తుండగా, యువతులు ఆ ఖాళీ ప్రదేశంలో అశ్లీల నృత్యాలు చేస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 4 మద్యం బాటిళ్లు, రూ.10 వేలనగదు, ఆరు కార్లను స్వాధీ నం చేసుకున్నట్టు డీఎస్పీ దేవకుమార్ తెలిపా రు. గతేడాది ఆగస్టు 16న కూడా వీరు ఇదేవిధంగా యువతులను తీసుకుని వచ్చి డ్యాన్స్ చేస్తుం డగా వారిపై కేసు నమోదు చేయడం జరిగింద న్నారు. వీరిలో వెజ్జు వెంకటదుర్గా సుబ్బారావుపై ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉందని, వీరిని అరెస్ట్‌చేసి కోర్డుకు తరలించినట్టు చెప్పారు.