ఆహాలివ్!
ABN , Publish Date - Jun 16 , 2025 | 01:09 AM
కొన్ని జీవులు చాలా తెలివిగా ఉంటాయి.. వాటి తెలివితేటలు అంచనా వేయడం అంత సులభం కాదు.. అటువంటి జీవుల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు గురించి చెప్పకుండా ఉండలేం..

సముద్రజలాల సంరక్షణ
మత్స్యసంపద అభివృద్ధి
డిసెంబర్ - మే మధ్య సంచారం
గుడ్లు పెట్టి సంతానోత్పత్తి
కాకినాడ,కోనసీమలో సంరక్షణ
నేడు ప్రపంచ సముద్ర తాబేళ్ల పరిరక్షణ దినోత్సవం
కాకినాడ/ఉప్పలగుప్తం/కాట్రేనికోన, జూన్ 15(ఆంధ్రజ్యోతి): కొన్ని జీవులు చాలా తెలివిగా ఉంటాయి.. వాటి తెలివితేటలు అంచనా వేయడం అంత సులభం కాదు.. అటువంటి జీవుల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు గురించి చెప్పకుండా ఉండలేం.. అవి దేశవిదేశాలు తిరిగి మళ్లీ అవి ఎక్కడైతే పుడతాయో అక్కడే పిల్లలను పొదుగుతాయంటే నమ్ముతారా.. నమ్మక తప్పదు మరి.. ఎందుకంటే ఇది నిజం.. ఆ కథేమిటో తెలియాలంటే ఈ కథనం చదివేయాల్సిందే మరి.. నేడు ప్రపంచ సముద్ర తాబేళ్ల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.. సముద్ర జలాలు కలుషితం కాకుండా.. మత్స్యసంపద అభివృద్ధికి సహకరించే సముద్రపు జీవుల్లో ప్రత్యేకమైనవి ఆలివ్ రిడ్లే తాబేళ్లు. తీరానికి దూరంగా సముద్రపు లోతుల్లో జీవించే ఈ తాబేళ్లు సాగర జీవుల ఆహార గొలుసులో కీలకపాత్ర పోషిస్తాయి.సముద్రపు నాచు తింటూ.. జలాలను శుభ్రపరుస్తాయి. సముద్రంలో తాబేళ్ళ సంఖ్య తగ్గిపోతే ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించిన ప్రభుత్వం ఏటా వీటి సంరక్షణకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏడు రకాల సముద్రపు తాబేళ్లు ఉంటాయి. మన భారతదేశ సముద్ర జలాల్లో ఐదు రకాల సముద్రపు తాబేళ్లు ఉ న్నాయి. వాటిలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఒకటి. ఈ జాతి ఆడ, మగ తాబేళ్లు ఏటా డిసెంబర్ మా సంలో సంతానోత్పత్తికి సముద్రంలో కలుసుకుంటాయి. కొన్నిరోజులపాటు తీర ప్రాంతంలో సంచరిస్తాయి. జనవరి మొదటివారం నుంచి ఆడ తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు సిద్ధమవుతాయి. ఫిబ్రవరి నెలలో భారీగా గుడ్లు పెట్టి.. ఏప్రిల్ నాటికి పూర్తిగా ఆపేస్తాయి. ఇవి పెట్టిన గుడ్లు పొదిగి పిల్లలుగా మారేందుకు సుమారు 40 నుంచి 50 రోజుల సమయం పడుతుంది. ఈ ప్రక్రియ డిసెంబర్ నుంచి మే వరకు జరుగుతుంది.ఈ ఆరు నెలల్లో ఆలివ్ రిడ్లే సంతానోత్పత్తి జరుగుతుంది. 2023-24లో హోప్ ఐలాండ్‌లో 262 తాబేళ్లు 23,202 గుడ్లు పెట్టాయి.2024-25లో హోప్‌ఐలాండ్‌లో 283 తాబేళ్లు 20,623 గుడ్లు పెట్టాయి.కోనసీమ జిల్లాలో ఐదు ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్ల హేచరీలున్నాయి.
కాకినాడ, కోనసీమ తీరాలకు..
సంతానోత్పత్తి సమయంలో ఈ ఆలివ్ రిడ్లే తా బేళ్లు కాకినాడ హోప్‌ఐలాండ్, కోనసీమ జిల్లాలోని ఎస్.యానాం, వాసాలతిప్ప, జీకే పోర, సాక్రిమెంట్ ఆయిల్ పలు తీరప్రాంతాలకు పెద్ద ఎత్తున వస్తుంటాయి.ప్రధానంగా డిసెంబర్ నెలలో 15-20 రోజులపాటు తీర ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. మగ తాబేలు సముద్రంలోకి వెళితే.. కేవలం ఆడ తాబేళ్లు మాత్రమే తీరంలో ఉంటూ గుడ్లను పెట్టి తిరిగి వెళ్లిపోతాయి. అడు గు నుంచి అడుగున్నర లోతు గొయ్యిని తవ్వుకుని..వాటిలో 60 నుంచి 160 వరకు గుడ్లు పెడతాయి.ఈ సమయంలో గుడ్లు రూపాంతరం చెందుతాయి. 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కన్నా తక్కువుంటే ఆ సమయంలో పెట్టిన గుడ్లన్నీ మేల్ జాతికి చెందినవిగా, 30 డిగ్రీల ఉష్ణోగ్రతపైబడి ఉన్న సమయంలో పొదిగిన గుడ్లు ఆడ తాబేళ్లుగా మారతాయి. 28-30 డిగ్రీ మధ్య ఉష్ణోగ్రతలో జన్మించిన తాబేళ్లు అటు మేల్ అయినా కావొచ్చు. ఇటు ఫిమేల్ అయినా కావొచ్చని శాస్త్రవేత డి.మహేష్‌బాబు తెలిపారు.
ఒడిశా టు కాకినాడ..
ఆలివ్ రిడ్లే తాబేళ్ల జీవన విధానం, పునరుత్పత్తి గురించి పరిశోధనలు జరుగుతున్నా యి.అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రం నుంచి ఇవి వేల కిలోమీటర్ల ప్రయా ణం చేసి ఇక్కడికి చేరుకుంటాయి. ఒక తాబేలు ఒడిశాలో కేంద్రపడ జిల్లా గహీర్ మఠ్ వద్ద సముద్రంలో ప్రయాణం ప్రారంభించి 51 రోజుల తర్వాత శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిల మీదుగా ఇది ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకుంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాగ్ దీనికి అమర్చి పరిశీలించగా ఈ విషయం తెలిసిందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.వాటికి అనుకూలమైన వాతావరణం ఉన్న కాకినాడ హోప్ ఐలాండ్‌తో పా టు కోనసీమలోని పలు తీర ప్రాంతాల్లో ఇవి సంతానోత్పత్తి చేపడతాయి.
ఆ రెండింటి మధ్య వ్యత్యాసాలివే..
ఆలివ్ రిడ్లే తాబేళ్ల ఏ తీరానికి పడితే ఆ తీరానికి రావు. ఒకసారి ఎక్కడైతే సంతానోత్పత్తి కోసం గుడ్లు పెట్టాయో.. తిరిగి అదే ప్రాంతానికి వస్తాయి. సాఽధారణ తాబేళ్ల కన్నా ఇవి పరిమాణంలో పెద్దగా ఉంటాయి. ఇవి 35 నుంచి 50 కిలోల బరువుతో సముద్రపు నీటిలోనే ఉంటా యి. తాబేళ్లు తీరానికి చేరుకునే సమయంలో ఐదు కిలోమీటర్ల పరిధిలో బోట్లు తిరగకుండా, చేపల వేట నిలిపివేసేలా చర్యలు తీసుకుంటున్నామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. తాబేళ్ల రాకకు ఏటా అటవీశాఖ అధికారులు బేస్ క్యాంపులు సిద్ధం చేస్తున్నారు.ఏటా తాబేళ్ల రాక సంకేతాలను గుర్తించి బీచ్ పరిసర ప్రాం తాలు శుభ్రం చేస్తున్నారు.గుడ్లు పెట్టేందుకు అనువైన వాతావరణం కల్పిస్తున్నారు.
సంరక్షణకు ప్రత్యేక చర్యలు
1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం.. సముద్ర తాబేళ్లను సంరక్షణకు అటవీశాఖ చర్యలు చేపడుతోంది. హేచరీలను ఏర్పాటు చేసి వాటి సంతతిని పెంచే ప్రయత్నాలు చేస్తు న్నాం. కాకినాడ హోప్‌ఐలాండ్‌లో మత్స్యకార కుటుంబాలకు వీటి సంరక్షణ బాధ్యత అప్పగించి, వారికి జీవనోపాధి కల్పిస్తున్నాం. ఆరు గురు బృందంగా బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసి వాటిని సంరక్షిస్తున్నాం,
- ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్, కోరింగ వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్