‘ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి’ చొరవతో సమస్యలకు మోక్షం
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:55 AM
రాజమహేంద్రవరం, ఆగస్టు11 (ఆంధ్రజ్యో తి): ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రజల సమస్యల పై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం చక్కటి ఫలితాలను ఇచ్చింది. ‘అక్షరమే అండా.. పరి ష్కారమే అజెండాగా’ అనే నినాదంతో ఈ ఏడాది జనవరి 28వ తేదీ రాజమహేంద్రవ రం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్‌లో శ్రీవేంకటేశ్వరనగర్‌లోని ఐఎంఏ హాల్‌లో ప్రజల సమక్షంలో సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌తోపాటు 9వ డివిజన్ టీడీపీ
‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’కు స్పందన
నేటి సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరం 9వ డివిజన్‌లో సభ
ముఖ్య అతిథిగా హాజరుకానున్న సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
రూ.10 కోట్లతో రోడ్లు, డ్రెయిన్లు తదితర సమస్యలకు పరిష్కారం
రాజమహేంద్రవరం, ఆగస్టు11 (ఆంధ్రజ్యో తి): ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రజల సమస్యల పై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం చక్కటి ఫలితాలను ఇచ్చింది. ‘అక్షరమే అండా.. పరి ష్కారమే అజెండాగా’ అనే నినాదంతో ఈ ఏడాది జనవరి 28వ తేదీ రాజమహేంద్రవ రం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్‌లో శ్రీవేంకటేశ్వరనగర్‌లోని ఐఎంఏ హాల్‌లో ప్రజల సమక్షంలో సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌తోపాటు 9వ డివిజన్ టీడీపీ ఇన్ చార్జి, మాజీ కార్పొరేటర్ చండీప్రియ, పలువు రు మున్సిపల్ అధికారులు, స్థానిక పెద్దలు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా 9వ డివిజన్ పరిధిలో నివసించే అనేకమంది సభకు వచ్చి అపరిష్కృతంగా ఉన్న తమ ప్రాంత సమస్యలు ఏకరవుపెట్టా రు. మాజీ కార్పొరేటర్ చండీప్రియ కూడా అక్కడి సమస్యలు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇవన్నీ విన్న ఎమ్మెల్యే వాసు కొద్దిరోజుల్లో ఇక్కడి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధ్వానంగా ఉన్న పారిశుధ్య సమ స్య అప్పటికప్పుడే పరిష్కారమైంది. విద్యుత్ లోవోల్టేజీ సమస్య పరిష్కారమైంది. వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి కావస్తోంది. అప్పట్లో కల్వర్టుల పేరుతో నెమ్మదిగా జరుగుతున్న పనులన్నీ పూర్తయ్యాయి. అవేకాక జేఎన్ రో డ్డు అధ్వాన పరిస్థితి చక్కబడింది. సుమారు రూ.10 కోట్లతో 32 ముఖ్యమైన పనులు పూ ర్తయ్యాయి. అందులో సీసీ డ్రెయిన్లు, సీసీ రోడ్లు, పార్కులు ఉన్నాయి. వైసీపీ హయాం లో కోర్టు లిటిగేషన్‌తో ఆగిపోయిన ఐఎంఏ హాల్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. వేంకటేశ్వరనగర్ పార్కు కింది భాగంలో మాస్టర్ ప్లాన్‌ను మార్చేసిన సమస్య ఇంకా పెండింగ్‌లో ఉంది. దానిపై ఇటీవల కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ‘ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి వేంకటే శ్వరనగర్‌లోని ఐఎంఏ హాల్‌లో మంగళవా రం సాయంకాలం 4 గంటలకు సక్సెస్ మీట్ ఏర్పాటుచేసింది. దీనికి ముఖ్య అతిఽఽథిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాజరుకానున్నారు.