Share News

అక్షర విజయం

ABN , Publish Date - Aug 13 , 2025 | 01:18 AM

రోడ్లు లేవన్నారు.. కొత్త రోడ్లు వచ్చాయి.. వాటర్‌ ట్యాంక్‌ పూర్తవలేదన్నారు.. అందుబాటులోకి వచ్చేసింది.. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు.. డ్రెయినేజీ సమస్యా పరిష్కారమైంది.. ఇలా ఒకటేమిటి.. చెప్పిన చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. దీనికి కారణం ఎవరంటే ఆ కాలనీ వాసులంతా ‘ఆంధ్రజ్యోతి’ వైపే చూపిస్తున్నారు..

అక్షర విజయం
సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

  • ‘ఆంధ్రజ్యోతి’ అక్షరం అజెండాలో సమస్యలు విన్నారు.. పరిష్కరించారు

  • 6 నెలల్లో రూ.10 కోట్ల అభివృద్ధి పనులు

  • 9వ వార్డులో పలు సమస్యలకు పరిష్కారం

  • ఆ వార్డులోనే ‘ఆంధ్రజ్యోతి’ సక్సెస్‌ మీట్‌

  • స్ఫూర్తిదాయకమన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

రోడ్లు లేవన్నారు.. కొత్త రోడ్లు వచ్చాయి.. వాటర్‌ ట్యాంక్‌ పూర్తవలేదన్నారు.. అందుబాటులోకి వచ్చేసింది.. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు.. డ్రెయినేజీ సమస్యా పరిష్కారమైంది.. ఇలా ఒకటేమిటి.. చెప్పిన చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. దీనికి కారణం ఎవరంటే ఆ కాలనీ వాసులంతా ‘ఆంధ్రజ్యోతి’ వైపే చూపిస్తున్నారు.. ఎందుకంటే ఒక కాలనీలో కేవలం 6 నెలల్లో ఏకంగా 10 కోట్ల విలువైన అభివృద్ధి పనులు సాధ్యమా అంటే అయ్యే పనికాదు.. కానీ ‘ఆంధ్రజ్యోతి’ అడుగుపెట్టింది. సమస్యలకు పరిష్కారం చూపింది. అక్షర విజయం సాధించింది. అదెలాగో మీరూ చదవండి..

రాజమహేంద్రవరం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్ర వరం వెంకటేశ్వరనగర్‌ 9 వార్డులో ఈ ఏడాది జనవరి 28, 29 తేదీల్లో ‘ఆంధ్రజ్యోతి అక్షరం అండగా.. పరిష్కారం అజెండాగా’ వినూత్నమైన కార్యక్రమం చేపట్టింది. ముందుగానే సమస్యలను గుర్తించింది. ఒక సభ నిర్వహించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌, మునిసిపల్‌ అధికారులు, కాలనీ ప్రజలను ఆహ్వానించింది. ఇక్కడ సమస్యలన్నీ ఎమ్మెల్యే విన్నారు.. త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.. 6 నెలల్లో రూ.10 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టారు.. కాలనీ వాసులు ఏం సమస్యలు చెప్పారో, వాటన్నింటినీ పరిష్కరించారు. దీనిలో భాగంగా అదే వార్డులోని ఐఎంఏ హాలులో ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం నిర్వహించిన సక్సెస్‌ మీట్‌కు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు హాజరై మాట్లాడారు. ‘ఆంధ్రజ్యోతి అక్షరం అండగా.. పరిష్కారం అజెండాగా’ వినూత్నమైన, స్ఫూర్తిదాయకమైన (ఒకటో పేజీ తరువాయి)

కార్యక్రమమన్నారు. ఆంధ్రజ్యోతి ‘ఆంధ్రజ్యోతి అక్షరం అండగా.. పరిష్కారం అజెండాగా’ సభ నిర్వహించగా రోడ్లు, డ్రెయినేజీలు, పార్కులు, కల్వర్టులు, కల్వర్టు స్లాబులు, శానిటేషన, విద్యు త, రేషన కార్డులు, గృహాలు తదితర అంశాలకు సంబంధించి స్థానిక ప్రజలు పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వాటిపై ఆంధ్ర జ్యోతి ఎప్పటికప్పుడు తనతో, అధికారులతో, స్థానిక ప్రముఖులతో సమన్వయం చేసుకుందని తెలిపారు. దీంతో కేవలం 6 నెలల్లో రూ.10 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, ఇంకా రూ.7 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 9వ వార్డును ఎంచు కోవడం ఈ ప్రాంత ప్రజలు అదృష్టం గా భావిస్తున్నారని చెప్పారు. అంద రూ అంధ్రజ్యోతికి కృతజ్ఞతగా ఉండా ల్సిన అవసరం ఉందన్నారు. బర్మా కా లనీలో ఓవర్‌ హెడ్‌ ట్యాంకు, కమ్యూ నిటీ హాలు కూడా నిర్మిస్తామ న్నారు. 2, 9, 45, 46, 10వ వార్డుల్లో పందుల సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వా నికి చెప్పినా పట్టించుకోలేదని, సమ స్య పరిష్కారానికి మళ్లీ ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ సారి ఒక్కవార్డు కాకుం డా తన నియోజకవర్గం మొత్తం ఇలాంటి కార్యక్రమం చేయాలని కోరుతున్నామన్నారు. నియోజకవర్గంలో 6 వేల కొత్త రేషన కా ర్డులు ఇచ్చామని, త్వరలోనే సీఎం చంద్రబాబు చేతు ల మీదుగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగు తుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్రజ్యోతి బ్రాంచి మే నేజరు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏబీఎన ఆంధ్రజ్యోతి యాజమా న్యం, ఎండీ రాధాకృష్ణ ఆలోచనలతో ప్రజల స్థానిక సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడమే లక్ష్యంగా అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా రూ పొందించడం జరిగిందన్నారు. దానిలో భాగంగా ఎమ్మెల్యే, అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వ యం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లామన్నా రు. దీంతో 9వ వార్డులో 6 నెలల్లో రూ.10 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ ప్రాంత రూపు రేఖలు మారిపోవడం ప్రజలు గుర్తించారన్నారు. ప్రజలు ఆంధ్రజ్యోతిని ఓన చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివా సు, మాజీ కార్పొరేటర్‌ కోసూరి చండీప్రియ, అధి కారులు, స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతు న్నామన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ రాజమండ్రి అధ్యక్షుడు డాక్టర్‌ పి.విజయ భాస్కర్‌, ఎలకి్ట్రకల్‌ డీఈ శామ్యూల్‌, మునిసిపల్‌ కార్పొరేషన డీఈ లోవరాజు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన డైరెక్టర్‌ సత్యనారాయణరాజు, వెంకటేశ్వర నగర్‌ వాకర్స్‌ అసోసియేషన అధ్యక్షుడు భాను ప్రసాద్‌, 11వ డివిజన టీడీపీ ఇనచార్జి రాజేంద్ర, యాడ్స్‌ మేనేజరు కృష్ణారావు, సర్య్కులే షన మేనేజరు గోపాలకృష్ణ, సీనియర్‌ రిపోర్టరు సత్యనారాయణ, స్టాఫ్‌ రిపోర్టరు రమేశ నాగేంద్ర, స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ రాజేశ్వరరావు, ఏబీఎన రాజబాబు, కెమెరామెన సతీశ, రిపోర్టర్లు శంకర్‌, వెంకన్న దొర, శ్రీకాంత, యాడ్స్‌ విభాగం రవీం ద్ర, సుబ్రహ్మణ్యం, శ్రీరామ్‌, విజయేంద్ర, కిరణ్‌, సర్క్యులేషన ఏసీవో బాషా, సాయి, మధు, గ ణేశ, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి అక్షరం.. ఆయుధమే..

ఆంధ్రజ్యోతి అక్షరం ఆయుధమే.. ఐఎంఏ హాల్‌ రోడ్డు ఆరు నెలల కిందట అధ్వానంగా ఉండేది.. ఇప్పుడు సిమెంటు రోడ్డు వేయడంతో రూపురేఖలు మారిపోయింది. పలు సమస్యలు ఒకట్రెండు రోజుల్లోనే పరిష్కారం అయ్యాయి.. మొత్తం కాలనీలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి.

- కోసూరి చండీప్రియ, మాజీ కార్పొరేటర్‌

Updated Date - Aug 13 , 2025 | 01:18 AM