సిద్ధివినాయకుని హుండీల ఆదాయం రూ.27.68 లక్షలు
ABN , Publish Date - May 21 , 2025 | 12:18 AM
అయినవిల్లి, మే 20 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీసిద్ధివినాయకస్వామి హుండీలను మంగళవారం లెక్కించారు. 61 రోజులకు ఆలయ ప్రధాన హుండీల ద్వారా రూ.26,86,790, అన్నప్రసాదం ద్వారా రూ.81,491 వెరసి మొత్తం రూ.27,68, 281 నగదుతో పాటు 4.4 గ్రాముల బంగా
అయినవిల్లి, మే 20 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీసిద్ధివినాయకస్వామి హుండీలను మంగళవారం లెక్కించారు. 61 రోజులకు ఆలయ ప్రధాన హుండీల ద్వారా రూ.26,86,790, అన్నప్రసాదం ద్వారా రూ.81,491 వెరసి మొత్తం రూ.27,68, 281 నగదుతో పాటు 4.4 గ్రాముల బంగారం, 436 గ్రాముల వెండి, 30 విదేశీ కరెన్సీ నోట్లు ఆదాయం లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. పర్యవేక్షణాధికారి జంపా రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో హుండీల లెక్కింపు ని ర్వహించారు. కార్యక్రమంలో అర్చకస్వాములు, గ్రామస్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.