మళ్లీ గుంతలు
ABN , Publish Date - Nov 22 , 2025 | 01:31 AM
రోడ్లు గుంతలు... వాహనాలు గంతులు చందంగా జిల్లాలోని ఆర్‌అండ్‌బీ, పంచా యతీరాజ్‌శాఖలకు చెందిన రోడ్ల పరిస్థితి ఉంది. ఈ రోడ్ల మీద ప్రయాణించేవారి ఒళ్లు హూనం అయిపోతోంది. అనేక రోడ్లకు రిపేర్లు చేసినా అవి మళ్లీ గుంతలు పడిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వం మొత్తం రోడ్లను నిర్ల క్ష్యం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడా ది సంకాంత్రి ముందు గుంతలు పూడ్చింది. కానీ మొంథా తుఫాన్ వల్ల మళ్లీ గోతులు పడ్డాయి. జిల్లాలో 87.99 కిలోమీటర్ల ఉన్న 48 ఆర్‌అండ్‌బీ స్టేట్ హైవే రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక పంచాయతీరాజ్‌కు చెంది న 33 రోడ్లు 69.465 కిలోమీటర్ల మేర దెబ్బ తిన్నాయి.
మొంథా తుఫాన్‌తో రహదారులకు తూట్లు
వాహనాల గంతులు
జనాల ఒళ్లు హూనం
అన్ని రోడ్ల దుస్థితీ ఇదే
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
రోడ్లు గుంతలు... వాహనాలు గంతులు చందంగా జిల్లాలోని ఆర్‌అండ్‌బీ, పంచా యతీరాజ్‌శాఖలకు చెందిన రోడ్ల పరిస్థితి ఉంది. ఈ రోడ్ల మీద ప్రయాణించేవారి ఒళ్లు హూనం అయిపోతోంది. అనేక రోడ్లకు రిపేర్లు చేసినా అవి మళ్లీ గుంతలు పడిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వం మొత్తం రోడ్లను నిర్ల క్ష్యం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడా ది సంకాంత్రి ముందు గుంతలు పూడ్చింది. కానీ మొంథా తుఫాన్ వల్ల మళ్లీ గోతులు పడ్డాయి. జిల్లాలో 87.99 కిలోమీటర్ల ఉన్న 48 ఆర్‌అండ్‌బీ స్టేట్ హైవే రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక పంచాయతీరాజ్‌కు చెంది న 33 రోడ్లు 69.465 కిలోమీటర్ల మేర దెబ్బ తిన్నాయి. ఇది అధికారుల లెక్క. ఇవికాకుండా అనేక పంచాయతీల పరిఽఽధిలో అనేక లింకు రోడ్లు అధ్వానంగా మారాయి. అధికా రుల లెక్కల ప్రకారం జిల్లాలో 60 పంచాయ తీరాజ్ రోడ్లు గుంతలమయం అయ్యాయి. ఆర్‌అండ్‌బీ రోడ్లకు సంబంధించి రాజమహేం ద్రవరం డివిజన్ పరిధిలోని రాజానగరం నుంచి పెద్దపర్తిరేవు రోడ్డు 9.2 కిలోమీటర్ల మేర, సోమేశ్వరం నుంచి రాజానగరం రోడ్డు 8 కిలోమీటర్ల మేర దెబ్బతింది. కొవ్వూరు డివి జన్ పరిధిలో మార్టేరు -పక్కిలంక రోడ్డు, ఏజీ ఆర్‌బీ రోడ్డు, విజ్జేశ్వరం-నిడదవోలు రోడ్డు, నిడదవోలు- అశ్వరావుపేట రోడ్డు, నరసాపు రం-అశ్వరావుపేట రోడ్డు, యర్నగూడెం- పొం గుటూరు రోడ్డు, తాడేపల్లి- అనంతపల్లి రోడ్డు చేబ్రోలు-దేవరపల్లిరోడ్డు, మద్దూరు బ్రిడ్జి నుం చి చంద్రవరం రోడ్డు, ఏజీఆర్‌బీ బల్లిపాడు నుంచి అన్నదేవరపేట రోడ్డు, గజ్జరం నుంచి హు కుంపేట రోడ్డు, ఎన్‌వై రోడ్డు నుంచి ఈజీకే రోడ్డు వయా కురుకూరు, పల్లంట్ల, లక్ష్మీపురం రోడ్డు, నల్లజర్ల నుంచి లక్ష్మీనగరం రోడ్డు పలుచోట్ల గుం తలమయం అయ్యాయి. ఇక పంచాయతీరాజ్‌కు చెందిన 33 రోడ్లు 69.465 కిలోమీటర్ల మేర దెబ్బ తిన్నాయి. వీటివల్ల రూ45.81 కోట్లు నష్టం జరి గింది. అన్ని మండలాల పరిధిలోను దెబ్బతిన్నా యి. చాలా గ్రామాల్లో పంచాయతీరాజ్ రోడ్డు పెద్దపెద్ద గోతులుగా మారాయి. కొవ్వూరు- మ ద్దూరు రోడ్డు, చంద్రవరం-మద్దూరు ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి వాడపల్లి కాలనీరోడ్డు, ఏజీఆర్‌బీ నుంచి తోగుమ్మిరోడ్డు, దేచర్ల అప్రోచ్‌రోడ్డు, అన్న దేవరపేట నుంచి సూర్యారావుపేట రోడ్డు, వేగేశ్వ రం నుంచి అన్నదేవరపేట, ఎంపీ రోడ్డు నుంచి చాగల్లు రైల్వేఫీడర్ రోడ్డు అధ్వానంగా తయార య్యాయి. అనపర్తిలో దొంతమూరు బీటీ రోడ్డు నుంచి నల్లమిల్లి రోడ్డు, ఏడీబీ రోడ్డు నుంచి వడి సలేరు, బిక్కవోలు నుంచి బలభద్రపురం, బల భద్రపురం నుంచి కానేడు మీదగా నల్లమిల్లి, ఆర్ అండ్‌బీ నుంచి తుమ్మలపల్లి, ఇల్లపల్లి మీదుగా రంగాపురం, కొండుకుదురు వి.సావరం, కుతు కులూరు నుంచి పులగుర్త, ఎల్‌ఎన్ పురం నుంచి మహేంద్రవాడ రోడ్డు, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి ఎల్‌ఎన్‌పురం, అనపర్తి నుంచి ద్వారపూడి ఐఎల్ టీడీ పుంతరోడ్డు అధ్వానంగా తయారయ్యాయి. రంగంపేట మండలంలో ముకుందవరం నుంచి ఏడీబీ రోడ్డు, సుబధ్రమ్మపేట నుంచి ముకుంద వరం, ఆర్‌ఎస్ రోడ్డు నుంచి వడిసలేరు, ఈస్త్ గోనగూడెం రోడ్డు పాడయ్యాయి. గోపాలపురంలో పీజే రోడ్డు నుంచి మీటు గోపాలపురం, సాగిపా డు రోడ్డు, పీజే రోడ్డు నుంచి కోమటిగుంట, నల్ల జర్ల మండలంలో చోడవరం నుంచి గుండే పల్లి, దేవరపల్లి నుంచి అచ్చయ్యపాలెం, దేవరపల్లి మండలంలో చిన్నాయిగూడెం నుంచి కుంతలగూ డెం, వైకె రోడ్డు నుంచి గాంధీనగర్, నల్లజర్ల మం డలంలో చేదర్శిగుంట నుంచి పోతరం, జి. కొత్త పల్లి రోడ్డు, అనంతపల్లి నుంచి కవులూరు రోడ్డు బాగా దెబ్బతిన్నాయి. ఉండ్రాజవరం మండలంలో తణుకు-పాలగుమ్మి సరిహద్దు పుంత, తణుకు -సావరం సరిహద్దు పుంత, వేలివెన్ను నుంచి నందమూరు అక్విడక్టు, వేలివెన్ను ఎస్‌సి ఏరియా నుంచి దమ్మెన్ను రోడ్డు పాడయిపోయాయి. వెలగ దుర్రు గ్రామ రోడ్డు, కెఎల్‌కె రోడ్డు నుంచి తాడిపర్రు-పాలగుమ్మి, ఉండ్రాజవరం రోడ్డు బాగా దెబ్బతిన్నాయి. నిడదవోలులో పురుషోత్తపల్లి నుం చి గోదావరి రివర్ బండ్, డి.ముప్పవరం నుంచి పురుషోత్తపల్లి రోడ్డు, శెట్టిపేట నుంచి వేలివెన్ను రోడ్డు, ఎన్‌వైరోడ్డు నుంచి సూరాపురం, విజ్జేశ్వరం గ్రామ రోడ్డు, ఎంపీ రోడ్డు నుంచి కోరుపల్లి రోడ్డు, దెబ్బతిన్నాయి. పెరవలి మండలంలో కానూరు నుంచి పెరవలి వరకు గల ఆర్‌అండ్‌బీ రోడ్డు, కానూరు-నడిపల్లి కోట రోడ్డు, పెరవలి - ముక్కామల రోడ్డు దారుణంగా దెబ్బతిన్నాయి. కానూరు నుంచి ఉసులుమర్రు వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డు, సిమెంటు రోడ్డు వేయడానికి నిధులు మంజూరు అయినట్టు మంత్రి దుర్గేష్ ప్రకటించినా పనులు ప్రారంభం కాలేదు. తాళ్లపూడి మండలంలో పైడి మెట్ట- అన్నదేవరపేట రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారడంతో జనం నరకం చూస్తున్నారు.