తోటలను పీల్చి పిప్పి చేస్తున్నాయ్!
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:47 AM
ఆఫ్రికా నత్తలు నరకం చూపిస్తున్నాయి.. రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తు న్నాయి..
పల్లెలకు పాకుతున్న వైనం
నాశనమైపోతున్న తోటలు
నష్టపోతున్న రైతాంగం
పనిచేయని పురుగుమందులు
కన్నెత్తి చూడని అధికారులు
రైతులకు కొత్త తలనొప్పి
నల్లజర్ల/ కోరుకొండ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యో తి) : ఆఫ్రికా నత్తలు నరకం చూపిస్తున్నాయి.. రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తు న్నాయి..ఎక్కడ నుంచి ఎలా వచ్చాయో తెలి యదు కానీ రైతులను పట్టిపీడిస్తున్నాయి.. ఎక్క డికక్కడ నత్తలు విజృంభించి పంటలు,తోటలను పీల్చి పిప్చి చేస్తున్నాయి.జిల్లా వ్యాప్తంగా రైతులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నల్లజర్ల మండలం ఆవపాడు, శింగరాజుపాలెం, ముసు ళ్ళకుంట, పుల్లలపాడు, కోరుకొండ మండలం దోసకాయలపల్లి తదితర గ్రామాల్లో నత్తల విజృంభణ అధికంగా ఉంది. నిమ్మ,ఆయిల్ పాం, కొబ్బరి, కోకో, కూరగాయల పంటలకు నత్తలు వందల సంఖ్యలో పట్టి రసం పీల్చేస్తున్నాయి. ఎన్ని పురుగుమందులు పిచికారీ చేసిన ఫలితం లేకపోవడంతో రైతాంగం తీవ్ర నిరాశకు గుర వుతున్నారు. వ్యవసాయాధికారులు,ఉద్యాన అధి కారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. కూలీల సహాయంతో తొలగిస్తున్నా మరుసటి రోజు మళ్లీ అదే సం ఖ్యలో నత్తలు చేరి సర్వనాశనం చేస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. నత్తల దెబ్బకు నిమ్మ, జామ తదితర చెట్లు ఎం డిపోతున్నాయి. చివరి దశకు వచ్చిన చేలు కళ్లెదుటే పీల్చిపిప్పిచేస్తుంటే తట్టుకోలేక రైతు లు ఆందోళనకు గురవుతున్నారు.
నత్తల నివారణ ఇలా..
ఫ ఈ నత్తలు మామూలుగా తోటలో కనిపించేవి కాదు.. ఆఫ్రికా దేశం నుంచి వలస వచ్చిన జాతి. ప్రస్తుతం పంటలను పట్టి పీడిస్తోంది. రైతాంగం దృష్టి పెడితే నివారించవచ్చు.
ఫ ఒక్కొక నత్త 1000 నుంచి 1200 గుడ్లు పెడుతుంది రైతులు సామూహికంగా నివారణ చర్యలు చేపట్టాలి.
ఫ తోటలో కనిపించిన నత్తలను చేతులకు గ్లౌజులు వంటివి తోడుక్కుని ఒక్కొకటిగా ఏరి ఒక కేజీ ఉప్పు లీటరు నీటిలో కలుపుకున్న ద్రావణంలో నత్తలను వేస్తే నివారించొచ్చు. మళ్లీ అవి వచ్చే అవకాశం ఉండదు. ఈ చిన్న చిట్కా పాటించాలి.
ఫ ఉధృతి ఎక్కువ ఉంటే 1లీ నీటికి 3గ్రాముల చిలెటెడ్ కాపర్, 3 గ్రాముల చిలెటెడ్ ఐరన్ కలిపి చెట్ల మీద పిచికారి చేసుకుంటే రాలి చనిపోతాయి.
ఫ ఒకతోట నుండి వేరొక తోటకి వ్యాప్తి చెందకుండా సరిహద్దులో అక్కడక్కడా ఉప్పునీరు చల్లిన గోనె పట్టలను పరిచినా వాటి వ్యాప్తి నివారించవచ్చు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పంటకు నాశనం తప్పదు. తెలియకుండానే పంటంతా నాశనమైపోతోంది.
ఫ నత్తల నివారణకు ఏ పురుగు మందు పిచికారి చేయకూడదు. చేసినా ఫలితం ఉండదు.