Share News

ఆట.. అవినీతి మేట

ABN , Publish Date - Aug 12 , 2025 | 01:53 AM

ఉమ్మడి జిల్లాలో ఆడుద్రాం ఆంధ్రాలో అంతా అడ్డంగా కలిపి బొక్కేశారు. నాటి వైసీపీ ప్రభు త్వ హయాంలో నిర్వహించిన క్రీడల్లో అసలు క్రీడాకారులంటే వైసీపీ చోటామోటా నేతలే పెత్త నం చెలాయించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఖరీదైన కిట్ల దగ్గరనుంచి విజేతల బహుమతుల వరకు అంతా తామే అయి జేబుల్లో వేసుకున్నారు.

ఆట.. అవినీతి మేట

  • ఉమ్మడి జిల్లాలో ‘ఆడుదాం ఆంధ్రా’లో అంతా అవినీతే

  • క్రీడల నిర్వహణ పేరుతో రూ.2.50కోట్ల వరకు బొక్కేశారు

  • క్రీడలు నిర్వహించకుండానే కిట్లు, నిధులకు లెక్కలు రాసేశారు

  • విజిలెన్స విచారణలో వెలుగులోకి ఆడుదాం ఆంధ్రా అక్రమాలు

  • ఉమ్మడి జిల్లాలో 62మండలాల ఎంపీడీవోల నుంచి 70పేజీల చొప్పున నివేదికలు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి జిల్లాలో ఆడుద్రాం ఆంధ్రాలో అంతా అడ్డంగా కలిపి బొక్కేశారు. నాటి వైసీపీ ప్రభు త్వ హయాంలో నిర్వహించిన క్రీడల్లో అసలు క్రీడాకారులంటే వైసీపీ చోటామోటా నేతలే పెత్తనం చెలాయించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఖరీదైన కిట్ల దగ్గరనుంచి విజేతల బహుమతుల వరకు అంతా తామే అయి జేబుల్లో వేసుకున్నారు. క్రీడల నిర్వహణ ఖర్చుల కోసం సచివాల యాలు, మండలాలు, నియోజకవర్గాలకు పంపిన రూ.2.50కోట్లను సైతం మింగేశారు. వెరసి క్రీ డాకారుల వసతి, రవాణా, భోజన ఖర్చుల పేరు తోను అడ్డగోలుగా నిధులు దిగమింగేశారు. నియోజకవర్గ, జిల్లాస్థాయిలో విజేతలకు బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సిన డబ్బులను సైతం కా జేశారు. వెరసి ఉమ్మడి జిల్లాలో ఆడుదాం ఆం ధ్రాలో అంతా అవినీతే చోటుచేసుకుందని విజిలె న్స అధికారులు తేల్చారు. ఈమేరకు ప్రభుత్వా నికి నివేదిక పంపారు. ఉమ్మడి జిఆ్లలో 62మం డలాల ఎంపీడీవో కార్యాలయాలనుంచి జిల్లా పరిషత అధికారులు రప్పించిన నివేదికలను వి జిలెన్సకు అందివ్వగా, దీనిద్వారా మరింత లోతు గా విచారణ జరిపి భారీ అక్రమాలు నిర్ధారించా రు. వినియోగించిన కిట్లను తిరిగి పాఠశాలలకు పంపాల్సి ఉండగా మాయమైనట్లు తేల్చారు.

అన్నీ అక్రమాలే...

గత వైసీపీ ప్రభుత్వం 2023 డిసెంబరు 15 నుంచి ఫిబ్రవరి 3వరకు ఆడుదాం ఆంధ్రా పే రుతో క్రీడలను ప్రోత్సహించడానికి ఉమ్మడి జి ల్లాలో పలు క్రీడలను నిర్వహించింది. పలు రకా ల క్రీడలను గ్రామ,వార్డు సచివాలయాలు, మం డల, నియోజకవర్గ స్థాయిల్లో నిర్వహించింది. ఈపోటీల్లో విజేతలకు జిల్లాస్థాయిలోను క్రీడలు నిర్వహించింది. ఈక్రమంలో కోట్లకుకోట్ల నిధులు వెచ్చించింది. ముఖ్యంగా క్రీడా పరికరాలను కోట్ల కు కోట్లు వెచ్చించి ప్రభుత్వమే జిల్లాలకు కిట్లు పంపించింది. అయితే వీటిని జాగ్రత్తగా విని యోగించాల్సి ఉండగా స్థానిక వైసీపీ నేతలు వీటన్నింటిని తన్నుకుపోయారు. క్రీడలు పూర్త యిన తర్వాత తిరిగి స్థానిక పాఠశాలలు లేదా ఎంపీడీ వో కార్యాలయాలకు అప్ప గించాల్సిఉన్నా అదేం చేయ లేదు. క్రీడల నిర్వహణకు సచివాల యాలకు రూ.10 వేల చొప్పున, మండలం, ని యోజకవర్గానికి రూ.25వేల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. విజేతలు, క్రీడల నిర్వహణ పేరుతో అప్పటి అధికారపార్టీ నేత లు వీటిని కాజేశారు. ఇలా ఆడుదాం ఆంధ్రా పేరుతో అప్పట్లో రాష్ట్రవ్యాప్తం గా రూ.119కోట్లు ఖర్చు చేయగా ఇందులో భారీ అవినీతి చోటుచేసుకుంది. దీనిపై ప్రభుత్వం విజిలెన్స విచారణకు ఆదేశించడంతో ఉమ్మడి జిల్లాలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చా యి. రెండునెలలుగా ఉమ్మడి జిల్లాలో 62 మం డలాల్లో విజిలెన్స అధికారులు ఆడుదాం ఆంధ్రా ఖర్చులు, వచ్చిన కిట్లకు సంబంధించిన నివేదిక లను జిల్లా పరిషత ద్వారా రప్పించారు.మొత్తం 32ప్రశ్నలకు సంబంధించి జాబితా పంపి ఎంపీ డీవోలనుంచి నివేదికలను కోరారు. ఒక్కో ఎంపీ డీవో కార్యాలయం నుంచి దాదాపుగా 70పేజీల చొప్పున నివేదికలు అందగా, వీటన్నింటిని విజి లెన్స అధికారులు క్రోడీకరించారు. భారీగా అక్ర మాలు జరిగాయన్న అనుమానాలున్న ఎంపీడీ వో కార్యాలయాల్లో విజిలెన్స అధికారులు స్వయంగా విచారణ జరిపి పలు ఫైళ్లను స్వాధీ నం చేసుకున్నారు. తద్వారా ఈ క్రీడల నిర్వహ ణలో అడుగడుగునా అక్రమాలు గుర్తించారు. ముఖ్యంగా అప్పటి సీఎం జగన ఫోటోలతో టె న్నికాయిట్‌ కిట్లు ఉమ్మడి జిల్లాకు 3,500, బేసిక్‌ క్రికెట్‌ కిట్లు ఉమెన, మెన స్టేజ్‌ 1 కిట్లు 5,300, బ్యాడ్మింటన రాకెట్లు 8వేలు, స్టేజ్‌ 1 వాలీబాల్స్‌ 4,200, ప్రొఫెషనల్‌ విభాగంలో స్టేజ్‌2 బ్యాడ్మిం టన రాకెట్లు 3,300, కబడ్డీ నీ క్యాప్‌లు, కోకో యాంక్లెట్స్‌ 10,500, టీషర్టులు 2.50లక్షలు ఉమ్మడి జిల్లాకు చేరాయి. వీటిలో చాలాకిట్లు క్రీడలు ముగిసిన తర్వాత ఎంపిక చేసిన స్థానిక పాఠశాలలకు పంపాలని అప్పట్లో ప్రభుత్వం ఆ దేశించింది. అందినట్లు ధృవీకరణ పత్రాలు తీసు కోవాలని తహసీల్దార్లు, ఎంపీడీవోలకు సూచిం చింది. కానీ ఈ వందలాటి కిట్లేవీ అసలు ఇప్ప టికీ పాఠశాలలకు చేరలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా అప్పట్లోనే స్థానిక వైసీపీ నేతలు ఎవరికివారు వీటిని ఇళ్లకు తీసుకుపోయినట్లుగా విజిలెన్స గుర్తించింది. అసలు సచివాలయాలు, మండల, నియోజకవర్గస్థాయి క్రీడలకు అసలు క్రీడాకారులు లేకపోయినా ఆటలు ఆడించినట్లు దొంగ నివేదికలు సృష్టించినట్లు తేల్చింది.

విజేతలకు పంగనామాలు..

క్రీడల నిర్వహణకు ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా 1590గ్రామ,వార్డు సచివాలయాలకు ప్రభుత్వం రూ1.59కోట్లు మంజూరు చేసింది. మండలాలు, నియోజకవర్గాలకు రూ.25లక్షల వరకు పంపింది. వీటిని క్రీడల నిర్వహణ, క్రీడాకారుల రవాణా,భోజన,విజేతల ప్రైజ్‌మనీ రూపంలో ఖర్చులకు వాడాలని సూచించింది. ఇవికాకుండా ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి ఉమ్మడి జిల్లాకు రూ.2.50కోట్ల వరకు రాగా, వీటికి తొంభైశాతం వరకు ఎక్కడికక్కడ దొంగ ఖర్చులు రాసి నొక్కేసినట్లు విజిలెన్స గుర్తిం చింది. జరగని పోటీలను జరిగినట్లు చూపిం చి తప్పుడు లెక్కలు రాసి నిధులు దిగమిం గేశారని గుర్తించింది. ఈనిధులను అప్పట్లో స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల అనుచరులు కొంద రు అధికారులు కలిపి దొంగ బిల్లులు చూపి డబ్బులు నొక్కేశారు. ఇలా సచివాలయాలు, మండలాలు, నియోజకవర్గస్థాయికి వచ్చిన లక్షలకు లక్షల నిధులను తప్పుడు లెక్కలతో కాజేశారు. నిబంధనల ప్రకారం నియోజకవర్గ, జిల్లాస్థాయి విజేతలకు నగదు బహుమతులు అందించాల్సి ఉంటే అదేదీ లేకుండా ఉత్త చేతులే చూపించారు. నియోకవర్గ స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచినవారికి, వరు సగా రూ.35వేలు, రూ.15వేలు, రూ.5వేలు, జి ల్లాస్థాయి తొలి ముగ్గురు విజేతలకు రూ.60వేలు, రూ.30వేలు, రూ.10వేల చొప్పన ఇవ్వాల్సి ఉంటే బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చేయలేదని తేల్చారు. ఇలా క్రీడల పేరుతో భా రీగా నొక్కేసినట్లు విజిలెన్స నిర్ధారించింది. ఇ ప్పటికే ఉమ్మడి జిల్లాలో అనేక ఎంపీడీవో కా ర్యాలయాల్లో తనిఖీలు పూర్తిచేసిన విజిలెన్స సోమవారం జగ్గంపేట ఎంపీడీవో కార్యాల యంలో సోదాలు చేసి పలు ఫైళ్లు, ఖర్చుల పేరుతో రాసిన బిల్లులను తీసుకువెళ్లింది.

Updated Date - Aug 12 , 2025 | 01:53 AM