బతికుండగానే బలి...!
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:11 AM
చింతూరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): వారంతా బతికే ఉన్నారు. ఐతే ఆన్‌లైన్ డేటాలో వారిని చంపేశారు. డేటా ఎంట్రీ తప్పు వల్ల వా రంతా ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. అల్లూరి జిల్లా చింతూరు మండలం చిడుమూరు గ్రామ పంచాయితీ చిడుమూరు, జువ్విగూడెం, బుర్కనకోట గ్రామాల్లో పలు కుటుంబాలు డేటా ఎంట్రీదారుల నిర్లక్ష్యానికి బలయ్యారు. చిడుమూ రుకు చెందిన మోసం రుతు వయస్సు 17ఏళ్లు. డేటా ఎంట్రీలో మృతి చెందినట్టు చూపడం
ఆన్‌లైన్ డేటా ఎంట్రీలో తప్పుడు సమాచారం
చనిపోయినట్టు ఉండడంతో ప్రభుత్వ పథకాలకు దూరం
లబోదిబోమంటున్న ఆదివాసీలు
చింతూరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): వారంతా బతికే ఉన్నారు. ఐతే ఆన్‌లైన్ డేటాలో వారిని చంపేశారు. డేటా ఎంట్రీ తప్పు వల్ల వా రంతా ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. అల్లూరి జిల్లా చింతూరు మండలం చిడుమూరు గ్రామ పంచాయితీ చిడుమూరు, జువ్విగూడెం, బుర్కనకోట గ్రామాల్లో పలు కుటుంబాలు డేటా ఎంట్రీదారుల నిర్లక్ష్యానికి బలయ్యారు. చిడుమూ రుకు చెందిన మోసం రుతు వయస్సు 17ఏళ్లు. డేటా ఎంట్రీలో మృతి చెందినట్టు చూపడంతో పాఠశాలలో చదువుకునేందుకు అవకాశం లేకుం డా పోయింది. జువ్విగూడెనికి చెందిన ముర్రం మీన, సోడె రంగమ్మ, ముర్రం తిరుపతమ్మ, బుర్కనకోటకు చెందిన కుంజా ముత్తమ్మ, చిడుమూరుకు చెంది న సవలం నాగమ్మ వితంతువులు. భర్తలు కాలం చేయడంతో చేతి కష్టంతో బతుకుసాగిస్తు న్నారు. ఐతే వారందరినీ డేటా ఎంట్రీలో చంపే శారు. దీంతో వీరంతా వితంతు పింఛనకు దూర మయ్యారు. అదే దశలో జువ్విగూడెనికి చెందిన కుంజా ఏసుబాబు, ముర్రం రాజు పేర్లు కూడా డేటా ఎంట్రీలో లేకపోవడంతో రేషను పొందే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో బాధితులం తా ఎన్నో రోజులుగా అధికారుల చుట్టూ తిరు గుతున్నారు. అయినా ఎవరూ పరిష్కారం చూ పడంలేదు. దీంతో నష్ట పోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. మరి తమ గోడును ప ట్టించుకునేదెవరని బాధితులు వాపోతున్నారు.