సత్యదేవుడికి ప్రముఖుల ప్రత్యేక పూజలు
ABN , Publish Date - May 23 , 2025 | 12:30 AM
అన్నవరం, మే 22 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో గురువారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, సినీనటుడు సాయికు
అన్నవరం, మే 22 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో గురువారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, సినీనటుడు సాయికుమార్ కుటుంబసభ్యులతో వేర్వేరుగా స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఈవో వీర్ల సుబ్బారావు ఆలయ మర్యాదలతో ఘనస్వా గతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేశారు.