Share News

ఊహించని ప్రమాదం..అందని పరిహారం..

ABN , Publish Date - May 25 , 2025 | 01:50 AM

రామవరానికి చెందిన కొమ్మరాజు హరీష్‌ ప్రత్తిపాడు బంధువుల ఇంటికి వెళ్లాడు. తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది.

ఊహించని ప్రమాదం..అందని పరిహారం..

బాధిత కుటుంబాలకు అందని నష్టపరిహారం

జిల్లాలో 52 కేసులు నమోదు, ముగ్గురికి మాత్రమే సాయం

(కాకినాడ - ఆంధ్రజ్యోతి)

రామవరానికి చెందిన కొమ్మరాజు హరీష్‌ ప్రత్తిపాడు బంధువుల ఇంటికి వెళ్లాడు. తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ప్రత్తిపాడు పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించలేదు. ఈ ప్రమాదం జరిగి సుమారు ఏడాది కావస్తోంది. అయినా ఆ కుటుంబానికి ఎటువంటి పరిహారం అందలేదు. అతడి కుటుంబసభ్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు తప్ప కనికరించేవారు లేరు. వీరే కాదు.. ఇలాంటి గుర్తు తెలియని వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంటిని నడిపే వారు ప్రమాదంలో మృతి చెందడం.. ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన, గాయాలపాలైన కుటుంబ సభ్యులకు ఎలాంటి పరిహారం అందకపోవడంతో వారం తా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం హిట్‌ అండ్‌ రన్‌ కింద నష్టపరిహారం చెల్లించే కార్యక్రమాన్ని 2022 ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించింది. కానీ దీని అమలులో అధికారులు నిర్లక్ష్యం చూపారు. ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు కదిలారు. ఈ తరహా బాధితులను గుర్తించి వారిని ఆదుకునేందుకు చర్య లు చేపట్టారు. ఇలా కాకినాడ జిల్లాలో ఇలాం టి కేసులు ఇప్పటి వరకు 52 నమోదయ్యా యి. కలెక్టర్‌ అనుమతితో వీరికి రావల్సిన పరిహారం కోసం ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌కు పంపారు. ముగ్గురికి ప్రభుత్వ పరిహారం అందించారు. మిగిలిన వారందరికీ 15 రోజుల్లో అందనున్నాయి. వాస్తవానికి రహదారులపై జరిగే ప్రమాదాల్లో గుర్తు తెలియని వాహనాలు ఢీకొని జరుగుతున్న ప్రమాదాలే అధికమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాలను అక్కడి నుంచి వేగంగా పోనిస్తున్నారు. వీటిని పట్టుకోవడం పోలీసులకు తలనొప్పిగా మా రింది. ప్రమాదానికి కారణమైన వాహనాలను గుర్తించకపోవడంతో బాధితులకు నష్టపరిహారం అందడం లేదు. వాహనాలను గుర్తిస్తే థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ వస్తుంది. అసలు వాహన ఆచూకీ లేకపోతే ఇలా చాలా మంది ఇబ్బం దులు పడాల్సి వస్తుంది. ఇలాంటి కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మృతి చెందిన కుటుంబ సభ్యులకు రూ.రెండు లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం అందిస్తోంది. బాధితులను గుర్తించే కార్యక్రమాన్ని జిల్లాలో ఇటీవల నిర్వహించారు. వారి నుంచి వివరాలు సేకరించారు.

పరిహారం అందాలంటే..

ప్రమాదాలకు కారణమైన వాహనాలను గుర్తించలేదని సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ నుం చి సమాచారం ఇవ్వాలి. దీనిని క్లెయిమ్‌ విచారణ అధికారి పరిశీలిస్తారు. నెల రోజుల్లో నివేదికను క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ జిల్లా కలెక్టర్‌కు అందజేస్తారు. ఇక్కడి నుంచి ఇన్స్యూ రెన్స్‌ కౌన్సిల్‌కు వెళుతుంది. అక్కడి నుంచి బాధితుల ఖాతాలోకి నష్టపరిహారం సొమ్ము అందుతుంది.

అన్ని శాఖల సమన్వయంతో..

‘హిట్‌అండ్‌రన్‌ కేసుల్లో బాధితులను ఆదు కునేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. పోలీసు కేసు మొద లు, వైద్యుడి నుంచి ధ్రువీకరణ, డివిజన్‌స్థాయి అధికారి పరిశీలించి బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. గుర్తుతెలియని వాహనాలు ఢీకొ ని జరిగే ప్రమాదాల్లో బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయంపై అవగాహన కల్పిస్తు న్నాం’’ అని రవాణా శాఖాధికారులు మాట.

Updated Date - May 25 , 2025 | 01:50 AM