Share News

గోదావరిలో ఇద్దరు భవానీ మాలధారుల గల్లంతు

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:59 AM

గోదావరిలో ఇద్దరు భవానీ మాలధారులు గల్లంత య్యారు

గోదావరిలో ఇద్దరు భవానీ మాలధారుల గల్లంతు

బావమరిదిని కాపాడబోయిన బావ

పుష్కర్‌ఘాట్‌ వద్ద ఘటన

భార్యాపిల్లల కళ్లెదుటే ప్రమాదం

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): గోదావరిలో ఇద్దరు భవానీ మాలధారులు గల్లంత య్యారు.గోకవరం మండలం పెంటపల్లికి చెందిన గుబ్బ ల బాపిరాజు(28) రాజమహేంద్రవరం ప్రకాశంనగర్‌ లోని ఒక అపార్టుమెంటులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నా డు.రాజానగరం మండలం శ్రీరాం పురానికి చెందిన బావమరిది (భార్య అన్న) రాయుడు వీరబాబు(21) హైదరాబాద్‌లోని ఓ గోల్డ్‌ షాపులో పనిచేస్తున్నాడు. దసరా కావడంతో బావ వద్దకు వచ్చాడు. బాపిరాజు, వీరబాబు, బాపిరాజు పెద్ద కూతురు నాలుగేళ్ల భవానీ భవానీ మాల వేసుకున్నారు. పుష్కరఘాట్‌కి శనివా రం సాయంత్రం గోదావరి స్నానానికి వచ్చారు.బాపిరాజు, వీరబాబు స్నా నానికి దిగారు. వరద ఉధృతి ఎక్కు వగా ఉండడంతో వీరబాబు కొట్టుకు పోతుండడంతో బాపిరాజు అతడి మెడలోని ఎర్ర కండువా అందించ బోయి వరద ఉధృతిలోకి జారిపోయాడు. దీంతో ఇద్దరూ గల్లంతయ్యారు.బాపిరాజు పది మీటర్ల వరకూ.. పుష్కర ఘాట్‌లో వరద మలుపు తిరిగే చోటు వరకూ చేయిపైకి పెట్టి టవల్‌ ఊపుతూనే ఉన్నాడు. అతడి భార్య శ్రావణి బావా బావా అని అరుచుకుంటూ మెట్ల వెంబడి పరుగు పెట్టిం ది.ఆ సమయంలో ఘాట్‌లో 150 మంది వరకూ జనం, పోలీసులు ఉన్నారని చెబుతున్నారు. కానీ ఎవరికీ ఈత రాకపోవడంతో గోదావరిలోకి దిగలేదు. ఒక వ్యక్తి మెట్ల వెంబడి పరుగు పెట్టుకుంటూ వెళ్లి బాపిరాజు జుట్టు పట్టుకున్నాడు. అయితే ఒడి తీవ్రంగా ఉండడంతో జుట్టు జారిపోయి వరదలో కొట్టుకుపోయాడు. అప్పటి వరకూ తనతో ఉన్న భర్త, అన్న వరదలో కొట్టుకు పోయారని తెలియడంతో భార్య, చిన్నారిని సముదాయిం చడం ఎవరి తరమూ కాలేదు. పోలీసులు, ఫైర్‌ సర్వీసు సిబ్బంది ఒక మత్స్యకార నావలో గాలింపు చేపట్టారు. చీకటి పడడం, వరద ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఫలితం లేక పోయింది.ఆదివారం ఉదయం కాకినాడ నుంచి ఎస్‌డీఆర్‌ ఎఫ్‌ బృందం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. శనివారం సాయంత్రమే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం గమనార్హం.

ప్రాణాలను మింగేసిన నిర్లక్ష్యం

వరద ఉధృతి రెండు రోజుల నుంచీ పెరుగుతోంది. మరో వైపు దసరా కావడంతో పెద్ద సంఖ్యలో భవానీ మాలధారులు పుష్కరఘాట్‌కి స్నానాలకు వస్తున్నారు. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినా ఘా ట్‌లో సరైన రక్షణ చర్యలు చేపట్టలేదు. వరద 54 అడు గులకు చేరుకున్నా కనీసం కర్రలతో బారికేడింగ్‌ నిర్మిం చలేదు. మెట్ల వద్ద చిన్నగా హెచ్చరికల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. వారం కిందట ఒక వ్యక్తి వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచాడు. అయినా రెవెన్యూ, మునిసిపల్‌ యంత్రాంగం మేల్కోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీటి వనరుల వద్ద ప్రమా దకర పరిస్థితులు ఉంటే ముందస్తు చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇది వరకే ఆదేశిం చారు. కానీ వాటిని కూడా స్థానిక యంత్రాంగం పట్టించుకోకపోవడం.. రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబాలను అనాథలుగా మిగిల్చింది.

Updated Date - Sep 28 , 2025 | 12:59 AM