Share News

ఏసీబీ వలకు చిక్కారు

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:49 AM

చింతూరు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): చింతూ రు ఉప ఖజానా కార్యాలయంలో విధులు నిర్వ ర్తిస్తున్న సబ్‌ ట్రెజరీ అధికారి జీడీ.వంశీకళ్యాణ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ ఎన్‌విఎంఎస్‌.సామ్యూల్‌ సోమవారం ఏసీబీ వలకు చిక్కారు. ఈ మేరకు విశాఖపట్నం రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ నాగేశ్వరరావు వెల్లడించిన వివ

ఏసీబీ వలకు చిక్కారు
ఏసీబీకి చిక్కిన వంశీ కళ్యాణ్‌, సామ్యూల్‌

రూ. లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్‌ ట్రెజరీ అధికారి, సీనియర్‌ అసిస్టెంట్‌

చింతూరు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): చింతూ రు ఉప ఖజానా కార్యాలయంలో విధులు నిర్వ ర్తిస్తున్న సబ్‌ ట్రెజరీ అధికారి జీడీ.వంశీకళ్యాణ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ ఎన్‌విఎంఎస్‌.సామ్యూల్‌ సోమవారం ఏసీబీ వలకు చిక్కారు. ఈ మేరకు విశాఖపట్నం రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ నాగేశ్వరరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నా యి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం నరసింహాపురం (బాలురు) ఆశ్రమ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా ఎస్‌.పకీర్‌ దొర విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా పకీర్‌ దొరకు చెం దిన పది సంవత్సరాల ఇంక్రిమెంట్లు ఏరియర్స్‌ బిల్లులు మొత్తం రూ.11,54,254 చెల్లింపు ప్రక్రియ ఆమోదించే క్రమంలో లంచంగా రూ.2 లక్షలు ఎస్టీవో (సబ్‌ ట్రెజరీ అధికారి) డిమాండ్‌ చేశాడు. ఈ మేరకు పకీర్‌ దొర ఏసీబీ అధికారులను ఆశ్ర యించగా వారు రంగంలోకి దిగారు. ముందుగా రూ.1లక్ష అడ్వాన్సుగా చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా నేరుగా కార్యాలయంలోనే పకీర్‌ దొర నుంచి సబ్‌ ట్రెజరీ అధికారి సూచన మేరకు సీనియర్‌ అసిస్టెంట్‌ రూ.1లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ట్టు డీఎస్పీ పేర్కొన్నారు. కేసు నమోదు చేయడం తో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నా మన్నారు. దాడిలో ఏసీబీ ఇన్సపెక్టర్‌ లక్ష్మణరావు, శ్రీనివాసరావు, వెంకట్రావు తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 12:49 AM