Share News

ఏసీబీకి చిక్కారు..

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:42 AM

ఆలమూరు, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై సోమవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్‌కుమార్‌, సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్లు వాసుకృష్ణ, భాస్కర్‌, సతీష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో పొలం రిజిస్ట్రే

ఏసీబీకి చిక్కారు..
ఏసీబీ దాడిలో పట్టుపడ్డ ఆలమూరు సబ్‌రిజిస్టార్‌ సరోజినికుమారి, కారు డ్రైవర్‌

ఆలమూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై దాడి

రూ.28 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన

సబ్‌రిజిస్ట్రార్‌, కారు డ్రైవర్‌

కేసు నమోదు

ఆలమూరు, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై సోమవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్‌కుమార్‌, సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్లు వాసుకృష్ణ, భాస్కర్‌, సతీష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో పొలం రిజిస్ట్రేషన్‌ నిమిత్తం రైతు వద్ద నుంచి నగదు డిమాండ్‌ చేసి తీసుకుంటుండగా సబ్‌రిజిస్ట్రార్‌ను పట్టుకున్నారు. ఆలమూరు మండలం బడు గువానిలంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యం అనే రైతు తన పేరు మీద ఉన్న 1.37 ఎకరాల భూమిని తన కుమారుడికి గిఫ్ట్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ చేయడానికి రూ.50 వేలు ఇవ్వాలని సబ్‌రిజిస్ట్రార్‌ కొన విమలసరోజినీ కుమారి లంచం డిమా ండ్‌ చేసింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ముప్పిరి వెర్రి య్య ద్వారా బేరం చేసుకుని రూ.28 వేలకు ఒప్పందం కుదిరింది. దీంతో గట్టి సుబ్రహ్మణ్యం ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం రిజిస్ట్రేషన్‌ అనం తరం రూ.28వేల నగదును సబ్‌రిజిస్ట్రార్‌ సరోజినీకుమారి కారు డ్రైవర్‌ డి.దుర్గాప్రసాద్‌కు ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్టు డీఎస్పీ కిషోర్‌కుమార్‌ తెలిపారు. ఈ నగదుతోపాటు కార్యాలయంలో అదనంగా ఉన్న రూ.35 వేల నగదును కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఈ మేరకు సబ్‌రిజిస్ట్రార్‌ సరోజినీకుమారి, కారు డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్టు ఆయన చెప్పారు.

Updated Date - Sep 02 , 2025 | 12:42 AM