ఆవ ముంపు శాశ్వత నివారణకు చర్యలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:15 AM
రూరల్‌లోని గ్రామాలు వర్షాకాలంలో గోదావరి వరదల వల్ల ఆవ ఛానల్‌లోని మురుగునీరు గోదావరిలో కలవగా ముంపునకు గురి కాకుండా ఇక్కడ పంపుహౌస్ నిర్మించి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్ని స్తున్నామని, వరదల సీజన్ నాటికి పంపుహౌస్ నిర్మాణ పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. వరదల సమయంలో రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని హుక్కుంపేట, నేతాజీ నగర్, రామకృష్ణానగర్ తదితర ప్రాంతాలు ఆవ ఛానల్ ద్వారా ముంపునకు గురి కా కుండా ఉండే విధంగా ధవళేశ్వరం సాయిబాబా గుడి వద్ద కాల్వలో నీటిని తోడి పోయడానికి రూ.3.80 కోట్లతో నిర్మించే పంపుహౌస్‌కు ఎమ్మెల్యే గోరంట్ల శనివారం శంకుస్థాపన చేశారు.

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి
రూ.3.80 కోట్లతో పంపుహౌస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ధవళేశ్వరం/రాజమహేంద్రవరం రూరల్, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): రూరల్‌లోని గ్రామాలు వర్షాకాలంలో గోదావరి వరదల వల్ల ఆవ ఛానల్‌లోని మురుగునీరు గోదావరిలో కలవగా ముంపునకు గురి కాకుండా ఇక్కడ పంపుహౌస్ నిర్మించి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్ని స్తున్నామని, వరదల సీజన్ నాటికి పంపుహౌస్ నిర్మాణ పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. వరదల సమయంలో రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని హుక్కుంపేట, నేతాజీ నగర్, రామకృష్ణానగర్ తదితర ప్రాంతాలు ఆవ ఛానల్ ద్వారా ముంపునకు గురి కా కుండా ఉండే విధంగా ధవళేశ్వరం సాయిబాబా గుడి వద్ద కాల్వలో నీటిని తోడి పోయడానికి రూ.3.80 కోట్లతో నిర్మించే పంపుహౌస్‌కు ఎమ్మెల్యే గోరంట్ల శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటిపడిపోయిందని కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. రూరల్ మండలం లో కోట్లాది రూపాయలతో నాణ్యతతో కూడిన సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ఇంటింటికీ కుళా యి ద్వారా గోదావరి నీటిని అందజేస్తామన్నారు. గోదావరిలో కలుషిత నీరు కలవకుండా 50 ఎంఎల్‌డీ, 5ఎంఎల్‌డీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు ఏర్పాటు చేశామని, రూ.12 కోట్లతో రాజమహేంద్రవరం నుంచి డ్రైన్ నిర్మించి ఆ మురుగునీటిని బ్యారేజీ దిగువున ఉన్న లంకల్లోకి పైపులైన్ ద్వారా తరలిస్తామన్నారు. గ్రామాల్లో డ్రైన్ నిర్మాణానికి మరో రూ.2.8 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. పుష్కరాల నాటికి గోదావరి బండ్ రోడ్డును అభివృద్ధి చేయనున్నామన్నారు. అలాగే హుకుంపేట రామకృష్ణానగర్‌లో రూ.1.37 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు గోరం ట్ల రవిరామ్ కిరణ్‌తో కలిసి శంకుస్థాపన చేశా రు. కార్యక్రమాల్లో ఎంపీడీవో శ్రీనివాసరావు, రా జమహేంద్రవరం కార్పొరేషన్ ఈఈ ఎస్‌కే మ దార్ష ఆలీ, డీఈ విరూపాక్షిరావు, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు, టీడీపీ మండలాధ్యక్షుడు ఎం.శివసత్యప్రసాద్, పండూరి అప్పారావు, ఆళ్ళ ఆనందరావు, తలారి మూర్తి, సావాడ శ్రీనివాస రెడ్డి, బత్తిన ఏడుకొండలు, యడ్ల మహేష్, గు ర్రాల వెంకట్రావు, ఒంటెద్దు స్వామి పాల్గొన్నారు.