రూ.7.10 కోట్లతో అనపర్తి-బిక్కవోలు రోడ్డు అభివృద్ధి
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:17 AM
వచ్చే సంక్రాంతి నాటికి అనపర్తి-బిక్కవోలు కెనాల్ రో డ్డు అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఎమ్మె ల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కెనాల్ రోడ్డులో వినాయకుడి ఆలయం వద్ద అనపర్తి నుంచి బిక్కవోలు వరకు రూ.7.10 కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు.
ఎమ్మెల్యే నల్లమిల్లి భూమిపూజ
అనపర్తి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వచ్చే సంక్రాంతి నాటికి అనపర్తి-బిక్కవోలు కెనాల్ రో డ్డు అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఎమ్మె ల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కెనాల్ రోడ్డులో వినాయకుడి ఆలయం వద్ద అనపర్తి నుంచి బిక్కవోలు వరకు రూ.7.10 కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు.ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కె నాల్ రోడ్డు దుర్భరంగా మారడంతో ఇటీవల రూ.5 కోట్లతో కొంత మేర రహదారి నిర్మాణం మరికొంత మేర మరమ్మతులు చేపట్టామన్నారు. మరీ దుర్భరంగా మారడంతో మొదటిగా రూ.4.50 కోట్లతో ఒక గ్రాంట్, రూ.2. 60 కోట్లతో మరో గ్రాంటును ప్రభు త్వం మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో అనపర్తి నుంచి బిక్కవోలు వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర రోడ్డును అభివృద్ధి చేస్తున్నామని సంక్రాంతి నాటికి పనులు పూర్తయ్యే వి ధంగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి నిధులు మంజూరు చేయించలేక.. కెనాల్ రోడ్డును బ్లాక్ లిస్ట్‌లో పెట్టారని ప్రజలను మభ్యపెట్టారని, బ్లాక్ లిస్టులో ఉంటే నిధులెలా మంజూరవుతున్నాయో ఆయనే చెప్పాలన్నారు. కెనాల్ రోడ్డు అభివృద్ధికి నిదులు మంజూరు చేసి న సీఎం చంద్రబాబుకు, రోడ్లు భవనాల శాఖ మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో గోదావరి ఈస్ట్రన్ డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకరరెడ్డి, ఏఎంసీ చైర్ పర్సన్ జుత్తుక సూర్యకుమారి, ఆళ్ల గోవిం దు, సిరపల్లి నాగేశ్వరరావు, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, కర్రి శేషారత్నం, గొల్లు హేమతులసి, గిరి డా గంగాభవాని, ఎంపీడీవో ఎం.రామకృష్ణారెడ్డి, తహశీల్దార్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.