గంజాయితో ఐదుగురి అరెస్ట్
ABN , Publish Date - Sep 25 , 2025 | 01:24 AM
అడ్డతీగల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.45 లక్షల విలువైన 900 కిలోల గంజాయిని రాజవొమ్మంగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా జరుగుతుందని సమాచారం అందడం తో అల్లూరి జిల్లా ఎస్పీ అమిత భర్దర్ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత ఆధ్వర్యంలో రాజవొమ్మంగి
రూ.45 లక్షల విలువైన 900 కిలోల గంజాయి స్వాధీనం
అడ్డతీగల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.45 లక్షల విలువైన 900 కిలోల గంజాయిని రాజవొమ్మంగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా జరుగుతుందని సమాచారం అందడం తో అల్లూరి జిల్లా ఎస్పీ అమిత భర్దర్ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత ఆధ్వర్యంలో రాజవొమ్మంగి సీఐ ఎస్.గౌరిశంకర్ పర్యవేక్షణలో ఎస్‌ఐ డి.వెంకటేష్, సిబ్బంది మంగళవారం గంగవరం శివారు నెమల్లి చెట్టు సెంటర్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఎండపల్లి వైపు నుంచి వస్తున్న స్కార్ఫియో, మోటార్‌సైకిల్, మినీవ్యానలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు పారిపోవడానికి ప్ర యత్నిస్తుండగా పట్టుకుని వాహనాలను తనిఖీ చేయగా ఆశోక్‌లీల్యాండ్ బడాదోస్త్ వాహనంలో 900 కిలోల గంజాయి పట్టుపడినట్టు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు. గంజాయి విలువ రూ.45 లక్షలు ఉంటుందన్నారు. ఒరిస్సా రాష్ట్రం మల్క నగిరి జిల్లా కామ్‌వాడ గ్రామానికి చెందిన పరేష్ బిస్వాస్, న్యూటెక్‌పడార్ రాలేగడా గ్రామానికి చెందిన రబీంద్ర కరా, కమ్‌వాడా గ్రామానికి చెందిన సకాంతరే, ఏఎస్‌ఆర్ జిల్లా దారకొండ గ్రామానికి చెందిన ముర్ల లక్ష్మణరావు, తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన నక్కా శివప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వారి నుంచి మ హింద్రా స్కార్ఫి యో, ఆశోక్‌లీల్యాండ్ బడాదోస్త్, ఎవేంజర్ బజాజ్ మోటారుసైకిల్, 5 సెల్‌ఫో న్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు గ్రూపుగా ఏర్పడి ఒరిస్సా రాష్ట్రంలోని మల్కన గిరి, చిత్ర కొంద డివిజన పరిసర గ్రామాల్లో గంజాయికొని రాజమహేంద్రవరం, విజయవాడ, చెన్నై, మహారాష్ట్ర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుపడినట్టు ఎస్‌ఐ తెలి పారు. పరీష్ బిస్వాష్‌పై ఇప్పటికే 2 ఎన డీపియస్ కేసులు ఉన్నాయని, గతంలో 920 కిలోల గంజాయి రవాణాలో కేసులో పరారీలో ఉన్నట్టు చెప్పారు. దాడుల్లో ఏఎస్‌ఐ సీహెచ వివి మహర్షి, హెడ్‌కానిస్టేబుల్ కె.రాంబాబు, పోలీసులు సీహెచ.ఆశోక్, కె.సాయినాద్, సీహెచ వీరబాబు, కొండబాబులు ఉన్నారు. నిందితుల ను పట్టుకున్నవారిని ఎస్పీ అభినందించారు.