కొంటామంటూ నటించి...కొట్టేస్తారు!
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:46 AM
జగ్గంపేట, డిసెంబరు 23 (ఆంధ్ర జ్యోతి): బంగారం, వెండి షాపుల్లో వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చినట్టుగా నటించి చోరీలు చేస్తున్న ఐదుగురు మహిళలను జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరా లను సీఐ వైఆర్‌కె శ్రీనివాస్ వెల్లడి ంచారు. పశ్చిమగోదావరి జిల్లాకు పాలకొల్లు మండలానికి చెంది
బంగారం, వెండి షాపుల్లో వస్తువులు చోరీలు చేస్తున్న మహిళల ముఠా అరెస్ట్
జగ్గంపేట, డిసెంబరు 23 (ఆంధ్ర జ్యోతి): బంగారం, వెండి షాపుల్లో వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చినట్టుగా నటించి చోరీలు చేస్తున్న ఐదుగురు మహిళలను జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరా లను సీఐ వైఆర్‌కె శ్రీనివాస్ వెల్లడి ంచారు. పశ్చిమగోదావరి జిల్లాకు పాలకొల్లు మండలానికి చెందిన కావ డి మహాలక్ష్మి, కావడి చిన్నదానమ్మ, కావడి పార్వతి, కావడి భవాని, చుక్కా నరస మ్మ, శ్యామల, రత్నం, రమ్య కలిసి ముఠాగా ఏర్పడి బంగారం షాపుల్లో వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చినట్టు నటించి చోరీలు చేస్తుం టారు. ఈ ముఠా ఈనెల 9న కాకినాడ జిల్లా జగ్గంపేట- గోకవరం రోడ్డులో తిరమల కాంప్లెక్స్ షాపు నెంబరు 2 శ్రీ కార్తికేయ జ్యువెలరీ షాపు నకు వచ్చారు. 350 గ్రాముల బరువు గల 8 జతలు వెండి పట్టీలు దొంగిలించారు. తర్వాత షాపు యజమాని శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యా దుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం జగ్గంపేటలో కావడి మహాలక్ష్మి, కావడి చిన్న దానమ్మ, కావడి పా ర్వతి, కావడి భవాని, చుక్కా నరసమ్మను అరెస్ట్ చేశారు. శ్యామల, రత్నం, రమ్య పరారీలో ఉన్నా రు. కావడి మహాలక్ష్మిపై తిరుపతి జిల్లా వెంకటగిరి పీఎస్‌లో 4కేసులు, కోట పీఎస్‌లో ఒక కేసు ఉన్నాయి. కావిడి చిన్న దానమ్మ, కావడి పార్వతిలపై కాకినాడ సీపీఎస్‌లో ఒక కేసు, నరసాపురం టౌన్‌లో ఒక పాత కేసులు ఉన్నాయి. కావడి భవానిపై మొగల్లూరు పీఎస్‌లో ఒక కేసు, తణు కు టౌన్ పీఎస్‌లో ఒక కేసు ఉన్నాయి. వారి ను ంచి 350 గ్రాముల బరువు గల 8 జతలు వెండి పట్టీలు స్వాధీనంచేసుకున్నామని సీఐ తెలిపారు.