రూ.34 కోట్లతో నరసన్న దేవస్థానం అభివృద్ధి
ABN , Publish Date - Jul 08 , 2025 | 01:22 AM
కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.34 కోట్లతో ప్రణాళికలు తయారు చేసి తాను, ఎమ్మెల్యే బలరామకృష్ణ కేంద్రప్రభుత్వ మంత్రులతో మాట్లాడామని, త్వరలోనే దేవస్థానాన్ని అభివృద్ధి చేయనున్నట్టు ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు.
ఎంపీ పురందేశ్వరి
కోరుకొండలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
కోరుకొండ/దివాన్‌చెరువు, జూలై 7(ఆంధ్ర జ్యోతి): కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.34 కోట్లతో ప్రణాళికలు తయారు చేసి తాను, ఎమ్మెల్యే బలరామకృష్ణ కేంద్రప్రభుత్వ మంత్రులతో మాట్లాడామని, త్వరలోనే దేవస్థానాన్ని అభివృద్ధి చేయనున్నట్టు ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. మండలంలోని పలు అభివృద్ధి పనులకు ఆమె ఎమ్మెల్యే బత్తు ల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి సోమవారం శ్రీకారం చుట్టారు. గాడాల-తొర్రేడు, గాడాల-పాలచర్ల, పాత మునగాల-కొత్త ములగాల సిమ్మెంటు రోడ్డు పనులకు, గాదరాడలో నిర్మించబోయే మల్టీపర్పస్ యాక్టివిటీ సెంటర్ (గ్రంథాలయం)భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేసి, శిలాఫలకం ఆవిష్కరించారు. అంతకుముందు ఎంపీ పురందేశ్వరి గాడాల గ్రామ దేవత పొన్నాలమ్మను దర్శించుకుని పూజలు చేశారు. తదుపరి ఇటీవల నిర్మించిన కణుపూరి-గాదరాడ, గాదరాడ-నందరాడ, గాదరాడలో వెంకన్న చెరువు సీసీ రోడ్డులను ఎంపీ పురందేశ్వరి ప్రారంభించారు. కార్యక్రమాల్లో బీజేపీ ఇన్‌చార్జి నీరుకొండ వీరన్న చౌదరి, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, అడ్డాల శివ చక్రవర్తి, కమిడి శ్రీరాం, మేడిశెట్టి శివరామ్, అడపా శ్రీనివాస్, అడ్డాల శ్రీను, పెందుర్తి అభిరామ్, కంటే నాగ కేశవరావు, బీజేపీ నాయకులు ఏపీఆర్ చౌదరి, దూది కాంతారావు, మూడు పార్టీల నాయకలు, కార్యకర్తలు పాల్గొన్నారు.