Share News

ముగ్గురి యువకుల అరెస్ట్‌

ABN , Publish Date - Sep 10 , 2025 | 01:12 AM

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 9 (ఆ ంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కానిస్టేబుల్‌, హోంగార్డులపై దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను అరెస్ట్‌ చేసినట్టు సౌత్‌జోన్‌ డీఎస్పీ ఎస్‌.భవ్యకిషోర్‌ మంగళవారం తెలిపారు. వివరాల ప్రకారం.. ఆది వారం అర్ధరాత్రి కోటిపల్లి బస్టాండ్‌ వెనుక సోనో

ముగ్గురి యువకుల అరెస్ట్‌
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ భవ్యకిషోర్‌

కానిస్టేబుల్‌, హోంగార్డులపై దాడి..

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 9 (ఆ ంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కానిస్టేబుల్‌, హోంగార్డులపై దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను అరెస్ట్‌ చేసినట్టు సౌత్‌జోన్‌ డీఎస్పీ ఎస్‌.భవ్యకిషోర్‌ మంగళవారం తెలిపారు. వివరాల ప్రకారం.. ఆది వారం అర్ధరాత్రి కోటిపల్లి బస్టాండ్‌ వెనుక సోనో విజన్‌ షోరూం దగ్గర రాజానగరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాతతుంగపాడుకు చెందిన పాత రౌడీషీటర్‌ కట్టుంగ హరీష్‌, రాజమహేంద్రవరం రూరల్‌ మండలం రాజవోలు అభ్యుదయ కాలనీకి చెందిన కర్రి దుర్గసూర్యప్రసన్నకుమార్‌, సంజీవయ్య కాలనీకి చెందిన ములపర్తి వినోద్‌ మద్యం మత్తులో గొడవపడుతున్నారు. ఆ సమయంలో నైట్‌ బీట్‌లో ఉన్న కానిస్టేబుల్‌ యు.నాగబాబు, హోం గార్డు కాళీ వారిని అదుపుచేయడానికి ప్రయత్నించగా వారిపైనే దాడి చేసి గా యపరిచారు. ఈ ఘటనకు సంబంధించి టుటౌన్‌ సీఐ టీఎన్‌వీఎస్‌ శ్యాం సుందర్‌ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముగ్గురిని సోమవారం రాత్రి ఈస్ట్‌ రైల్వేస్టేషన్‌ రోడ్డులో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కేసు న మోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ టీఎన్‌వీఎస్‌ శ్యాంసుందర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 01:12 AM