చిన్నారి తల్లి.. మనసు తల్లడిల్లి..
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:33 AM
ఆత్రేయపురం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ స్కూల్ బస్సు కింద పడి ప్రమాదవశాత్తు మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. వివరా ల ప్రకారం... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరుకు చెం దిన నాగిరెడ్డి రాజు- సురేఖ దంపతులకు కమా రుడు పవన్, కుమార్తె హరిణి వరలక్ష్మి (3) సంతానం. పవన్ ఆత్రేయపురం మహర్షి విద్యానికేతన్‌లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. మంగళవా రం తల్లి సురేఖ కుమారుడు ఉదయ పవన్‌ను స్కూల్ బస్సు ఎక్కించేందుకు రోడ్డు మీదకు వ చ్చింది. ఆమె వెనకాల కుమార్తె కూడా వచ్చింది.
కొడుకుని స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా
తల్లి వెనకాల వచ్చిన కుమార్తె
బస్సు కింద పడి చిన్నారి మృతి
ఆత్రేయపురం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ స్కూల్ బస్సు కింద పడి ప్రమాదవశాత్తు మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. వివరా ల ప్రకారం... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరుకు చెం దిన నాగిరెడ్డి రాజు- సురేఖ దంపతులకు కమా రుడు పవన్, కుమార్తె హరిణి వరలక్ష్మి (3) సంతానం. పవన్ ఆత్రేయపురం మహర్షి విద్యానికేతన్‌లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. మంగళవా రం తల్లి సురేఖ కుమారుడు ఉదయ పవన్‌ను స్కూల్ బస్సు ఎక్కించేందుకు రోడ్డు మీదకు వ చ్చింది. ఆమె వెనకాల కుమార్తె కూడా వచ్చింది. ఆ విషయం తల్లి గమనించలేదు. పవన్‌ను స్కూల్ బస్సు ఎక్కడంతో ముందుకు కదిలింది. బస్సు వెనుక వైపు హరిణి ఉన్నట్టు బస్సు డ్రైవర్ గుర్తించకపోవడంతో వెనక చక్రం కింద పడి చిన్నారి హరిణి తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతిచెందడతో సురేఖ బోరున విల పించింది. ఎస్‌ఐ రాము ఘటనా స్థలానికి చేరుకున్నారు. సురేఖ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. వెలిచేరులో విషాదఛాయలు అలుముకున్నాయి.