Share News

త్రీ..రంగ్‌దే!

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:38 AM

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి మూడు రకాల కీలక నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి.

త్రీ..రంగ్‌దే!
టోల్‌గేట్‌

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

బాలికలు,మహిళలు,ట్రాన్స్‌జెండర్లకు ఆధార్‌తో ఫ్రీ

హైవే ప్రయాణానికి ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌

రూ.3 వేలు చెల్లిస్తే 200 సార్లు ఛాన్స్‌

రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌ ద్వారా పాస్‌లు

రైతులకు కొత్త పాస్‌బుక్‌లు నేటి నుంచే

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి మూడు రకాల కీలక నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి. వీటి ద్వారా ఇకపై పలు వర్గాలకు స్వేచ్ఛ లభించనుంది. ముఖ్యంగా మహిళలు,యువతులు, హైవేల పై ప్రయాణించే వాహనదారులు, అన్నదాతలు లబ్ధిపొంద నున్నారు. నేటి నుంచి అమల్లోకి రానున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,హైవే టోల్‌గేట్ల దోపిడీ నుంచి బయటపడేలా కొత్త ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌, కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీయే. ఈ మూడు కీలక నిర్ణయాల అమలుతో ఆయా వర్గాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది.

నేటి నుంచి ఫ్రీ..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేటి సాయం త్రం నుంచి అందుబాటులోకి రానుంది. పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బాలికలు, మహిళలు,ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించే సౌల భ్యం అందుబాటులోకి రానుంది. కేవలం ఆధార్‌కార్డు చూపించి రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణించొచ్చు. ఈ మేరకు ఈపథకాన్ని సీఎం చంద్రబాబు నేటి సాయంత్రం ప్రారంభించనున్నారు. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో అడ్డగో లుగా ఆర్టీసీ ఛార్జీలను పెంచేసి పేదల నడ్డి విరగ్గొట్టింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు టీడీపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రకటించి నేటి నుంచి అమలు చేస్తోంది.ఉమ్మడి జిల్లాలో దాదాపు 38 లక్షల మం దికిపైగా మహిళలు లబ్ధిపొందనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 11 ఆర్టీసీ డిపోల పరిధిలో 532 పల్లెవెలుగు, ఆలా్ట్రపల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు 191, కోనసీమలో 176 పల్లెవెలుగు, తూర్పుగోదావరిలో పల్లెవెలుగు,ఆలా్ట్రపల్లె వెలుగు,ఇతర బస్సులు 283 ఉన్నాయి.ఎక్స్‌ప్రెస్‌ బస్సులు వంద వరకు ఉన్నాయి. వీటన్నింటిలోను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకానుంది.

హైవేపై హాయిగా...

కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వార్షిక ఫాస్టాగ్‌ పాస్‌ అమల్లోకి రానుంది. తద్వారా కేవలం రూ.3 వేల ఫాస్టాగ్‌ తీసుకుని దేశంలో ఏ హైవేపై ఉన్న టోల్‌ప్లాజా ద్వారా ఫ్రీగా ప్రయాణించవచ్చు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి అమ ల్లోకి వచ్చింది.ఈ పాస్‌ ద్వారా ప్రయాణించే వెసులుబాటు కార్లు, వ్యాన్‌లు, జీపులు ఇతర వ్యక్తిగత అవసరాలకు వినియోగించే వాటికే వర్తిస్తుంది. ఈ విధానం వల్ల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వాహనదారులకు భారీగా ప్రయోజనం కలిగించనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐదు టోల్‌ప్లాజాలు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధీనంలో ఉన్నాయి.ఆయా టోల్‌గేట్లు వద్ద నిర్ణీత రుసుంను ఫాస్టాగ్‌ ద్వారా చెల్లించాలి. వీటితో పాటు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు వద్ద మరో టోల్‌ ప్లాజా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఏపీఆర్‌డీసీ ఆధీనంలో ఉంది. ప్రస్తుతం ఈ టోల్‌ప్లాజాల ద్వారా వెళ్లే ప్రతి వాహనానికి టోల్‌ఫీని వాహనానికి ఉన్న ఫాస్టాగ్‌ ద్వారా చెల్లించాలి. ఒక వేళ ఫాస్టాగ్‌ సొమ్ములు లేకున్నా..ఫాస్టాగ్‌ లేకున్నా నిర్ణీత రుసుము కంటే 100 శాతం అదనంగా చెల్లించాలి. కొత్త విధానంలో ఫాస్టాగ్‌ రీ చార్జి తరచూ చేసుకునే ఇబ్బంది లేకుండా ఏడాది రుసుం చెల్లించే విఽధంగా కేంద్రం కొత్త నిర్ణయం తీసుకొచ్చింది. ఈ ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌కు ఏడాదికి రూ.3 వేలు చెల్లించాలి.ఇలా రీచార్జి చేయించిన వాహనం దేశవ్యాప్తంగా ఏ టోల్‌ప్లాజా ద్వారానైనా 200 సార్లు ప్రయాణించే అవకాశం ఉంది. ఏడాది లేదా 200 సార్లు ఏది ముందైతే దానిని పరిగణనలోకి తీసుకుంటారు.వాణిజ్య అవసరాలకు తిరిగే వాహనాలకు అవకాశం ఉండదు.రాష్ట్ర రహదారులు, ఇతర ప్రాంతాల్లో టోల్‌గేట్ల వద్ద సాధారణ పద్ధతి లో ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ ఫీ చెల్లించాలి.తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద సాధారణ ఫాస్టాగ్‌ ద్వారానే టోల్‌ఫీ చెల్లించాలి. ఫా స్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ రాజ్‌మార్గ్‌ యా త్ర యాప్‌ లేదా ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు.

రైతులు పాస్‌..పాస్‌

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి రైతులకు ప్రభుత్వం కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనుంది. భూసర్వే పూర్తయిన గ్రా మాల్లో రైతులకు కొత్త పాస్‌ పుస్తకాలను అధి కారులు అందించబోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అసలు పాస్‌పుస్తకాల జారీయే పెద్దగా జరగలేదు. అప్పటి సీఎం జగన్‌ అస్త వ్యస్త విధానాలతో చేపట్టిన భూసర్వే పేరుతో మరింత తలనొప్పి పెరిగింది.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ము ను పటిలా ఆంధ్రప్రదేశ్‌ రాజముద్రతో కొత్త పాస్‌ పుస్తకాల జారీకి రెవెన్యూశాఖ నిర్ణయించింది. ఎట్టకేలకు ఇవన్నీ ప్రింటింగ్‌ పూర్తి చేసుకుని జిల్లాలకు చేరుకున్నాయి. గత వైసీపీ హయాం లో కాకినాడ జిల్లా 15 మం డలాల పరిధిలో 269 గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లా 19 మండలాల్లో 190 గ్రామాలు, కోనసీమ జిల్లాలో 150 కిపైగా గ్రామాల్లో సర్వే చేశారు. నేటి నుం చి రీసర్వే పూర్తిచేసుకున్న గ్రామాల్లో పం పిణీ చేయనున్నారు.కాకినాడ జిల్లాలో 1.47 ల క్షలు, కోనసీమ జిల్లాలో 1.02 లక్షలు,తూర్పుగోదావరి జిల్లాలో 95 వేల వరకు పాస్‌ బుక్‌లు ఇవ్వను న్నారు.ఇకపై స్వేచ్ఛగా రైతులు భూముల క్ర యవిక్రయాలు,బ్యాంకు రుణాలు తెచ్చుకోవచ్చు.

Updated Date - Aug 15 , 2025 | 12:38 AM