Share News

దళితుడిపై అమానుష దాడి కేసులో..

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:53 AM

అమలాపురం టౌన్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి): దళితుడిపై అమానుష దాడి కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్టు అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్కే ప్రసాద్‌ తెలిపారు. ఈ వివరాలను బుధ వారం అమలాపురం టౌన్‌ పోలీసుస్టేషన్‌లో డీఎస్పీ విలేకర్లకు వివరించారు. డాక్టర్‌ బీఆర్‌ అ ంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వెలువలపల్లికి చెందిన దళితుడు దోనిపాటి మహేశ్వరరావు అలియాస్‌ మహేష్‌ అమలాపురం రాయల్‌ కళాశాలలో పని చేసే విజయ్‌కుమార్‌ ద్వా

దళితుడిపై అమానుష దాడి కేసులో..

ముగ్గురి అరెస్ట్‌, పరారీలో మరో ముగ్గురు : అమలాపురం డీఎస్పీ

అమలాపురం టౌన్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి): దళితుడిపై అమానుష దాడి కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్టు అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్కే ప్రసాద్‌ తెలిపారు. ఈ వివరాలను బుధ వారం అమలాపురం టౌన్‌ పోలీసుస్టేషన్‌లో డీఎస్పీ విలేకర్లకు వివరించారు. డాక్టర్‌ బీఆర్‌ అ ంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వెలువలపల్లికి చెందిన దళితుడు దోనిపాటి మహేశ్వరరావు అలియాస్‌ మహేష్‌ అమలాపురం రాయల్‌ కళాశాలలో పని చేసే విజయ్‌కుమార్‌ ద్వారా తుని పురపాలక సంఘంలో బిల్‌ కలెక్టర్‌గా పనిచేసే ఉద్యోగి సిరసపల్లి ఉదయ్‌శంకర్‌ అమలాపురం, ముమ్మిడివరం నగర పంచాయతీలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడని తెలిసి తనకు తెలిసిన వ్యక్తి కోసం రూ.2లక్షలు సొమ్ములు చెల్లించి రెండేళ్ల క్రితం మోసపోయాడు. దాంతో మహేష్‌ ఉదయ్‌శంకర్‌కు ఫోన్‌ చేసి డబ్బులు అడగగా కొంతమందికి కాన్ఫరెన్సు కాల్‌ కలుపుతాను. మా పెద్ద సార్‌లా మాట్లాడి వారం రోజుల్లో మీకు ఆర్డరు కాపీలు వచ్చేస్తాయని చెబితే చాలు అని మహేష్‌ను నమ్మించాడు. తద్వారా మిగిలిన సొమ్ములు వచ్చిన తరువాత మహేష్‌కు ఇవ్వాల్సిన మొత్తం ఇస్తానని మరోసారి నమ్మబలికాడు. ఈ తరహాలో మహేష్‌ పలుసార్లు కాన్ఫరెన్సు కాల్స్‌లో యల్లమిల్లి విజయ్‌, యర్రా కృష్ణ తదితరులతో మాట్లాడాడు.

సొమ్ముల కోసం చిత్రహింసలు..

ఉదయ్‌శంకర్‌కు ఉద్యోగాలు నిమిత్తం యల్లమిల్లి విజయ్‌ ద్వారా ఏడుగురు బాధితులు రూ. 6.75లక్షలు చెల్లించారు. ఉదయ్‌శంకర్‌ మోసం చేశాడని తెలిసి ఈనెల 19వ బాధితులు ఉదయ్‌శంకర్‌, మహేష్‌ను రమ్మని పిలిచారు. మహేష్‌ తను గతంలో పనిచేసిన రాయల్‌ కళాశాలలో పనిచేస్తున్న విజయ్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరు అధ్యాపకులను తీసుకుని 2మోటారు సైకిళ్లపై పేరూరు సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ యల్లమిల్లి విజయ్‌, ఉరదల బాలరాజు, యర్రా కృష్ణ, మరికొందరు కలిసి యర్రా కృష్ణ పేరూరులో అద్దెకు ఉంటున్న రేకుల షెడ్డు వద్దకు తీసుకువెళ్లారు. ఉదయ్‌శంకర్‌, మహేష్‌పై దాడిచేశారు. అక్కడికక్కడ రూ.3లక్షలు చెల్లించాలని నిర్బంధించారు. బోడసకుర్రులోని నిర్మానుష్య ప్రా ంతానికి తీసుకువెళ్లి రబ్బరు ట్యూబు, కర్ర, కొబ్బరి మట్టలతో దాడి చేశారు. ఉదయ్‌శంకర్‌ స్వల్పంగా గాయపడ్డాడు. మహేష్‌పై అమానుషంగా దాడి చేశారు. బీరు బాటిల్‌ పగులకొట్టి పొడి చేందుకు, నదిలో తోసేసేందుకు ప్రయత్నం చేశారు. అలా రెండుమూడు చోట్లకు తీసుకెళ్లి మహేష్‌, ఉదయ్‌శంకర్‌లపై దాడి చేశారు. ఆ సమయంలో మహేష్‌ సోదరుడు 112కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. వెంటనే పట్టణ సీఐ పి.వీరబాబు తీవ్రంగా గాయపడ్డ దోనిపాటి మహేశ్వరరావును అమలాపురం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మహేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ పి.శ్రీనివాస్‌ కేసు నమోదు చేశారు. డీఎస్పీ ప్రసాద్‌ దర్యాప్తు చేసి కీలక ఆధారాలను సేకరించామన్నారు. ఈ కేసుకు సంబంధించి అమలాపురం శ్రీరామపురం ప్రాంతానికి చెందిన యల్లమిల్లి విజయ్‌రవిశంకర్‌, ఈదరపల్లి గ్రామానికి చెందిన ఉరదల బాలరాజు, విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందిన యర్రా కృష్ణను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి ఆటో, రబ్బరు ట్యూబులు, దాడికి ఉపయోగించిన ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో పరారైన ముగ్గురు నిందితుల కోసం బృందాలను నియమించినట్టు ఆయన తెలిపారు.

Updated Date - Jul 24 , 2025 | 12:53 AM