Share News

ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:18 AM

రాజమహేంద్రవరం, ఆగస్టు 14 (ఆంధ్ర జ్యోతి): రాజమహేంద్రవరం త్రీటౌన్‌ పోలీసులు ముగ్గురు దొంగలను అరెస్ట్‌ చేసి 34 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీ రమేశ్‌బాబు గురువారం వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గామన్‌ బ్రిడ్జి వద్ద త్రీ టౌన్‌

ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ముగ్గురి అరెస్ట్‌
రాజమహేంద్రవరంలో నిందితుల వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ రమేశ్‌బాబు

34 వాహనాలు స్వాధీనం

డీఎస్పీ రమేశ్‌ బాబు

రాజమహేంద్రవరం, ఆగస్టు 14 (ఆంధ్ర జ్యోతి): రాజమహేంద్రవరం త్రీటౌన్‌ పోలీసులు ముగ్గురు దొంగలను అరెస్ట్‌ చేసి 34 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీ రమేశ్‌బాబు గురువారం వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గామన్‌ బ్రిడ్జి వద్ద త్రీ టౌన్‌ సీఐ వి.అప్పారావు ఆధ్వర్యంలో వాహ నాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు అనుమానా స్పదంగా ప్రవర్తించడంతో పోలీసులు ప్రశ్నించా రు. ద్విచక్రవాహనాల దొంగతనాల కేసుల్లో వా ళ్లు నిందితులుగా ఉన్నారని గుర్తించారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన కుప్పాల రంగారావు, స్నేహితులు గోపిరెడ్డి యోహాను, మెకానిక్‌ సిర్రా బంగారుబాబును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశారు. త్రీటౌన్‌, భీమవరం, గుడివాడ, ఏలూరు పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి 17 మోటారు సైకిళ్లతో కలిపి రూ.14లక్షల విలువైన మొత్తం 34 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నా మని డీఎస్పీ తెలిపారు. విధుల్లో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ వి.అప్పారావు, ఎస్‌ఐ వి.అప్పలరాజు, హెచ్‌ సీలు వి.కృష్ణ, ఎన్‌.వెంకట రామయ్య, కె.సురేశ్‌, చంద్రశేఖర్‌, కానిస్టేబుళ్లు బి.విజయ్‌కుమార్‌, మహేశ్‌, పవన్‌ని ఎస్పీ నరసింహ కిషోర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Aug 15 , 2025 | 12:18 AM