Share News

చెడు వ్యసనాలకు బానిసలై ఇళ్ల వద్ద పార్కింగ్‌ బైక్‌ల చోరీలు

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:47 AM

గోకవరం, జూలై 4(ఆంధ్రజ్యోతి): మోటారు సైకిళ్లపై గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్టు నార్త్‌జోన్‌ డీఎస్పీ వై.శ్రీకాంత్‌ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలను వె ల్లడించారు. గోకవరం గ్రామ శివారు బాపనమ్మ తల్లి గు

చెడు వ్యసనాలకు బానిసలై ఇళ్ల వద్ద పార్కింగ్‌ బైక్‌ల చోరీలు
పట్టుబడిన నిందితులతో పోలీసులు, స్వాధీనం చేసుకున్న బైక్‌లు

గోకవరంలో 14 కిలోల

గంజాయితో ముగ్గురి అరెస్ట్‌

16 బైక్‌లు స్వాధీనం

గోకవరం, జూలై 4(ఆంధ్రజ్యోతి): మోటారు సైకిళ్లపై గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్టు నార్త్‌జోన్‌ డీఎస్పీ వై.శ్రీకాంత్‌ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలను వె ల్లడించారు. గోకవరం గ్రామ శివారు బాపనమ్మ తల్లి గుడి వద్ద ఎస్‌ఐ పవన్‌కుమార్‌ తన సిబ్బం దితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో 2 మోటారుసైకిళ్లపై ముగ్గురు 2 గోనె సంచులతో అనుమానాస్పదంగా కనిపించా రు. వారి వద్ద సంచులను పరిశీలించగా గంజా యిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గోక వరం మండలం కామరాజుపేట గ్రామానికి చెం దిన పాసం కొండలరావు, వాకాడ పవన్‌కుమార్‌, కాకర్ల వెంకటకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్‌ల దొంగతనాలు బయట పడ్డా యన్నారు. పట్టుబడిన ముగ్గురు తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదా వరి, ఏలూరు, ఒడిస్సా ప్రాంతాల్లో ఇళ్ల వద్ద పార్కింగ్‌ చేసిన మోటా రుసైకిళ్లను దొంగిలించి కామరా జుపేట శివారున ఉన్న ఫారెస్ట్‌ చెక్‌పోస్టు సమీపంలోని పైపులైన్‌ వద్ద దాచేవారు. వాటిని గోకవరానికి చెందిన ఆవుల వంశీ ఏజెన్సీ ప్రాం తాలకు తీసుకెళ్లి అక్కడ గంజాయికి మారుబేరం చేస్తున్నట్టు విచార ణలో తేలిందన్నారు. ప్రస్తుతం వంశీ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 14 కిలోల గంజాయి, దొంగిలించిన 14 మోటారుసైకిళ్లు, గం జాయి రవాణా చేస్తూ పట్టుబడిన రెండు మోటా రుసైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ముగ్గురు వ్యక్తులు చెడు వ్యసనాలకు బానిసలై అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డుతున్నట్టు డీఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో కోరుకొండ సీఐ వై. సత్యకిషోర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:47 AM