Share News

ఒంటరిగా ఉన్న వృద్ధులే టార్గెట్‌!

ABN , Publish Date - Jun 30 , 2025 | 12:11 AM

అమలాపురం టౌన్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ఒంటరిగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లను అమలాపురం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు

ఒంటరిగా ఉన్న వృద్ధులే టార్గెట్‌!

మాయమాటలు చెప్పి ఇళ్లల్లోకి ప్రవేశించి డబ్బు, బంగారం, వెండి చోరీలు

ముగ్గురు మైనర్లను అరెస్టు చేసిన అమలాపురం పోలీసులు

21.50 గ్రాముల బంగారం, 110 గ్రాముల వెండి, మోటారు సైకిళ్ల స్వాధీనం

అమలాపురం టౌన్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ఒంటరిగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లను అమలాపురం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామానికి చెందిన 15 నుంచి 16 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న వృద్ధులకు మాయమాటలు చెప్పి వారి ఆధార్‌ కార్డు, రూ.500 నగదు తీసుకుని వస్తే దగ్గరలో ఉన్న సెంటర్‌లో, సచివాలయాల్లో గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారని నమ్మించేవారు. వారు అలా వెళ్లగానే ఇళ్లల్లోకి ప్రవేశించి డబ్బు, బంగారం, వెండి ఆభరణాలను దొంగతనం చేశారు. అమలాపురం నల్లవంతెన, విత్తనాలవారి కాల్వగట్టు, పేరూరు ప్రాంతాలతో పాటు ముమ్మిడివరం, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో నగదు, నగలుతో పాటు మోటారు సైకిళ్ల దొంగతనాలకు పాల్పడ్డారు. ఆత్రేయపురం, కడియం పరిసర ప్రాంతాల్లో ఇదే తరహా దొంగతనాలు చేశారు. వరుస చోరీలకు పాల్పడుతున్న బాలురను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.40వేలు నగదు, 21.50 గ్రాముల బంగారు ఆభరణాలు, 110 గ్రాముల వెండి, 2 స్ల్పెండర్‌ మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని రాజమహేంద్రవరం మూడోవ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ర్టేట్‌, జువైనల్‌ మెజిస్ర్టేట్‌ ముందు హాజరుపరిచారు.నిందితులు ముగ్గు రుమైనర్లను రాజమహేంద్రవరం జువైనల్‌ హో ంకు తరలించినట్టు సీఐ వీరబాబు తెలిపారు.

Updated Date - Jun 30 , 2025 | 12:11 AM