ఈనెల 24 నుంచి డిసెంబర్ 2 వరకూ ‘రైతన్న మీకోసం’ ఇంటింటి సర్వే
ABN , Publish Date - Nov 23 , 2025 | 01:27 AM
ఈనెల 24 నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకూ ‘రైతన్న-మీకోసం’ కార్యక్రమం కింద హౌస్ టు హౌస్ సర్వే నిర్వహించనున్నారు.
రాజమహేంద్రవరం, నవంబరు 22 (ఆంధ్ర జ్యోతి): ఈనెల 24 నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకూ ‘రైతన్న-మీకోసం’ కార్యక్రమం కింద హౌస్ టు హౌస్ సర్వే నిర్వహించనున్నారు. రై తుల జీవనోపాధి, ఆర్థికస్థితి, నైపుణ్యాభివృద్ధితో అంచనా వేసి, రైతుల్లో శాశ్వత మార్పు తీసుకు రావడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం సాయంత్రం స్థానిక క్యాంప్ కార్యాల యం నుంచి వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యా న, మత్స్య, అనుబంధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూ రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశాల ప్రకారం రైతుల స్థితిగతులపై ఇం టింటా సర్వే చేస్తున్నామన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి రైతుతో మాట్లాడడం కోసం ఏడు రోజుల పాటు హౌస్ టు హౌస్ సర్వే చేయనున్నట్టు చెప్పారు. నీటిభద్రత, డిమాండ్ ఆధారిత వ్యవ సాయం, వ్యవసాయ పద్ధతుల్లో సాంకేతికత, ఆహార ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు అనే ఐదు సూత్రాల పట్ల రైతులకు అవగాహన కల్గించనున్నట్టు చెప్పారు. ఈనెల 24 నుంచి 29వ తేదీ వరకు రైతుల ఇళ్లకు అధికారుల బృందాలు వెళతాయని, ఈనెల 30 నుంచి డిసెంబర్ 2 వరకూ డేటా సేకరించి విశ్లేషిస్తా రన్నారు. వచ్చేనెల 3వ తేదీన ఈ డేటా ఆధా రంగా 2026-27 సంవత్సరానికి సంబంఽధించిన కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేస్తామని, దాన్ని ప్రతీ రైతు సేవా కేంద్రంలోనూ కార్యశాల నిర్వ హించనున్నట్టు చెప్పారు. గ్రామస్థాయిలో రైతు సేవా కేంద్రం ద్వారా నిర్వహించే ఈ ప్రచారం లో ఆర్‌ఎస్‌కే సహాయకులు, పశుసంవర్ధక, మత్స్యశాఖ సహాయకులు, గ్రామ రెవెన్యూ అధి కారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎనర్జీ అసి స్టెంట్లు, ప్రగతిశీల రైతులు, ప్రాథమిక వ్యవసా య కమిటీలు, నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు భాగ స్వాములవుతారని తెలిపారు. ఈ సర్వే కోసం ప్రతీ మూడు కుటుంబాలను ఒక క్లస్టర్‌గా విభ జించి, ఒక అధికార బృందం రోజుకు 30 క్లస్ట ర్లు అంటే 90 ఇళ్లు సందర్శిస్తారన్నారు. ఒక్కో బృందం మొత్తం 540 కుటుంబాల వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఈ సమయంలో సీఎం సందేశం లేఖ, కరపత్రం కూడా రైతులకు అందజేస్తారన్నారు. ఏపీఏఐఎంఎస్ యాప్ విని యోగంపై రైతులకు అవగాహన కల్పిస్తారన్నా రు. ఇంటింట ప్రచారంలో రైతుల నుంచి సేక రించిన సూచనలు, ఫిర్యాదులను ప్రణాళిక తయారుచేసి 3న ఆర్‌ఎస్‌కే స్థాయిలో వర్కు షాప్ నిర్వహించనున్నట్టు ఆమె వివరించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్, జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో ఎస్.భాస్కర రెడ్డి, ఆర్డీవోలు ఆర్.కృష్ణనాయక్, రాణి సుస్మిత, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, జిల్ల పశు సంవర్ధక అధికారి కె.శ్రీనివాసరావు, జిల్లా హార్టికల్చర్ అఽధికారి ఎన్. మల్లిఖార్జున రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి టి.నిర్మలా కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.