Share News

రూ2.20 కోట్లతో అభివృద్ధి పనులు: వాసు

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:40 AM

కూటమి అధికారంలోకి వచ్చాక రాజమహేంద్రవరం 49వ డివిజన్‌లో ఇప్పటి వరకు చేయాల్సినవి, చేస్తున్నవి కలిపి రూ2.20 కోట్ల అభివృద్ధి పనులు ఉన్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక సింహచల్‌నగర్‌లో ఉన్న టిడ్కో ఇళ్లకు సంబంధించి చేపట్టిన సీసీ డ్రైన్‌ నిర్మాణ పనులకు శనివారం కమిషనర్‌ రాహుల్‌మీనాతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

రూ2.20 కోట్లతో అభివృద్ధి పనులు: వాసు
శిలాఫలకం ఆవిష్కరించిన ఎమ్మెల్యే వాసు, కమిషనర్‌ రాహుల్‌

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు27( ఆంధ్రజ్యోతి): కూటమి అధికారంలోకి వచ్చాక రాజమహేంద్రవరం 49వ డివిజన్‌లో ఇప్పటి వరకు చేయాల్సినవి, చేస్తున్నవి కలిపి రూ2.20 కోట్ల అభివృద్ధి పనులు ఉన్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక సింహచల్‌నగర్‌లో ఉన్న టిడ్కో ఇళ్లకు సంబంధించి చేపట్టిన సీసీ డ్రైన్‌ నిర్మాణ పనులకు శనివారం కమిషనర్‌ రాహుల్‌మీనాతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014-19 టీడీపీ పాలనలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు వైసీపీ హయాంలో చివరి దశలో వైసీపీ రంగులు వేసి, లబ్ధిదారులకు ఇచ్చారని అయితే రంగులు వేయించడంలో ఉన్న శ్రద్ధ సౌకర్యాల కల్పన పను ల్లో చూపించలేదని విమర్శించారు. రూ.16.70 లక్షలతో మరో డ్రైన్‌ మంజూరుకు కమిషనర్‌ దృష్టి పెట్టారన్నారు.

  • గుంతలు లేని నగరం..

ఇదిలా ఉండగా స్థానిక ఏవీ అ ప్పారావు రోడ్డులో గుంతలను పూ డ్చే పనులకు ఎమ్మెల్యే వాసు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నగరంలో సుమారు 507 గుంతలు పూ డ్చుతున్నట్టు చెప్పారు.గతంలో కురిసిన వర్షా లు, తుఫాన్‌ కారణంగా గుంతల పూడ్చివేత పనుల్లో అంతరాయం ఏర్పడిందని, మూడో ఫేజ్‌ లో నగరంలోని ప్రధాన రహదారుల్లో గుంతలు పూడ్చివేతకు శ్రీకారం చుట్టామన్నారు. సంక్రాం తి లోపు పూడ్చివేయాలని అధికారులకుసూచించారు. కార్యక్రమాల్లో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌, మజ్జి రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, ఉప్పులూరి జా నకిరామయ్య, మొకమాటి సత్యనారాయణ, సలాది ఆనంద్‌, దాస్యం ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 12:40 AM