Share News

ఎవరెస్టు శిఖరం అధిరోహించడమే లక్ష్యం

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:13 AM

మోతుగూడెం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): చింతూరు మండలం మోతుగూడెం పరిధిలో ఉన్న కొత్తపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్‌ సోడే తిరుపతమ్మ, అప్పారావుల కుమారుడైన 14ఏళ్ల అభిరాం పర్వతారోహణపై మక్కువ పెంచుకున్నాడు. భవిష్యత్తులో ఎవరెస్టు శిఖరం అధిరోహించా

ఎవరెస్టు శిఖరం అధిరోహించడమే లక్ష్యం
భువనగిరిలో శిక్షణలో భాగంగా ట్రెక్కింగ్‌ చేస్తున్న అభిరాం

భువనగిరిలో ట్రెక్కింగ్‌ శిక్షణ తీసుకున్న 14 ఏళ్ల అభిరాం

మోతుగూడెం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): చింతూరు మండలం మోతుగూడెం పరిధిలో ఉన్న కొత్తపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్‌ సోడే తిరుపతమ్మ, అప్పారావుల కుమారుడైన 14ఏళ్ల అభిరాం పర్వతారోహణపై మక్కువ పెంచుకున్నాడు. భవిష్యత్తులో ఎవరెస్టు శిఖరం అధిరోహించాలనేదే తన లక్ష్యమని తెలిపాడు. పర్వతారోహణపై మక్కువతో శిక్షణ తీసుకుంటున్నానని, ఆర్థిక సాయం అందింతే కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. చింతూరులోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఎవరెస్టు అధిరోహించిన వీఆర్‌పురం మండలం కుంజవారిగూడెంకు చెందిన కుంజా దుర్గారావు స్ఫూర్తి, సూచనలతో అభిరాం కిలిమంజారో పర్వతం ఎక్కాలనుకున్నాడు. అతడి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఈ నెల 14నుంచి 16 వరకు తెలంగాణలోని భువనగిరిలో ట్రెక్కింగ్‌లో శిక్షణ ఇప్పించారు. కిలిమంజారో అధిరోహణ ఆర్థికభారంతో కూడుకోవడంతో వారు బు ధవారం ఐటీడీఏ పీవో అపూర్వ భరత్‌ను ఆశ్ర యించి తమ కుమారుడి ఆశ నెరవేర్చేందుకు ఐటీడీఏ నుంచి ఆర్థిక సాయం చేయాలని కోరారు. స్పందించిన పీవో ముందుగా అభిరాంకు పాస్‌పోర్టు చేయించాలని, ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు బాలుడి తల్లిదండ్రులు తెలిపారు.

Updated Date - Mar 23 , 2025 | 12:13 AM