Share News

11,280 మెట్రిక్‌ టన్నుల మిగులు ధాన్యం

ABN , Publish Date - May 06 , 2025 | 12:45 AM

నియోజక వర్గ వ్యాప్తంగా రైతుల వద్ద 11,280 మెట్రిక్‌ టన్నుల మిగుల ధాన్యం ఉందని, దానిని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేసి అన్న దాతలను ఆదుకోవాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు వినతి పత్రం అందజే శారు. ఈ మేరకు కాకినాడలో మంత్రి మనోహర్‌ను ఎమ్మెల్యే బత్తుల సోమవారం మర్యాద పూర్వకంగా కలిసిన మిగుల ధాన్యం కొనుగోలు అంశాన్ని విన్నవించారు.

 11,280 మెట్రిక్‌ టన్నుల మిగులు ధాన్యం
మంత్రి నాదెండ్ల మనోహర్‌కు వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే బత్తుల

  • రైతుల నుంచి కొనుగోలు చేయాలని మంత్రి మనోహర్‌కు ఎమ్మెల్యే బత్తుల వినతి

రాజానగరం, మే 5(ఆంధ్రజ్యోతి): నియోజక వర్గ వ్యాప్తంగా రైతుల వద్ద 11,280 మెట్రిక్‌ టన్నుల మిగుల ధాన్యం ఉందని, దానిని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేసి అన్న దాతలను ఆదుకోవాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు వినతి పత్రం అందజే శారు. ఈ మేరకు కాకినాడలో మంత్రి మనోహర్‌ను ఎమ్మెల్యే బత్తుల సోమవారం మర్యాద పూర్వకంగా కలిసిన మిగుల ధాన్యం కొనుగోలు అంశాన్ని విన్నవించారు. నియోజక వర్గంలోని రాజానగరం, సీతానగరం, కోరుకొం డ మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులు వద్ద ధాన్యం ఇంకా మిగిలి ఉందని, అకాల వర్షాల కారణంగా అన్నదాతలు ఆందోళణ చెందుతున్నారని మంత్రికి విజ్ఞప్తి చేశారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో 100 మెట్రిక్‌ టన్నులు, నాగంపల్లిలో 580, మిర్తిపా డులో 80, రఘుదేవపురంలో 4,620, చినకొండే పూడిలో 600, ముగ్గళ్లలో 250, వంగలపూడిలో 300, సింగవరం 450, కాటవరంలో 300 మెట్రిక్‌ టన్నులు ధాన్యం రైతుల వద్ద ఇంకా మిగిలి ఉం దన్నారు. అలాగే కోరుకొండ మండలం జంబూ పట్నంలో 50, మునగాల 140, రాఘవాపురం 50, కోటికేశవరం 50, దోసకాయలపల్లి 50, బొల్లె ద్దుపాలెంలో 510, కోటిలో 100, నరసాపురంలో 50, శ్రీరంగపట్నంలో 100, మధురపూడిలో 50, బూరుగుపూడిలో 50, నిడిగట్లలో 50 మెట్రిక్‌ టన్నులు మిగులు ధాన్యం ఉన్నట్లు మంత్రికి నివేదించారు. రాజానగరం మండలం సంపత్‌న గరంలో 250, యర్రంపాలెంలో 300, ముక్కినా డలో 100, తోకాడలో 2,100; నందరాడలో 150, నరేంద్రపురంలో 50 మెట్రిక్‌ టన్నుల మొత్తంగా మూడు మండలాల్లోనూ 11,280 మెట్రిక్‌ టన్ను ల మిగుల ధాన్యం ఉన్నట్లుగా వినతి పత్రంలో పొందుపర్చారు. దీనిపై మంత్రి మనోహర్‌ స్పం దిస్తూ రాష్ట్రంలో అన్నదాతలను కూటమి ప్రభు త్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. రైతుల వద్ద నుంచి ఆఖరి గింజ వరకు ప్రభు త్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ విషయమై తక్షణమే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని భరోసా ఇచ్చారన్నారు.

Updated Date - May 06 , 2025 | 12:45 AM