Share News

పదో తరగతి విద్యార్థినికి గర్భం

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:37 AM

రాయవరం, జూలై 28 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని కరస్పాండెంట్‌ లోబర్చుకుని గర్భవతిని చేసిన సంఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. బాలిక ఒక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. విద్యార్థినికి సుమారు 4 నెలలుగా నెలసరి

పదో తరగతి విద్యార్థినికి గర్భం

కోనసీమ జిల్లాలో ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్‌ నిర్వాకం

రాయవరం, జూలై 28 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని కరస్పాండెంట్‌ లోబర్చుకుని గర్భవతిని చేసిన సంఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. బాలిక ఒక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. విద్యార్థినికి సుమారు 4 నెలలుగా నెలసరి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యం చేయించేందుకు ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు బాలిక గర్భవతి అని తెలి పారు. దీంతో తల్లిదండ్రులు కుమార్తెను గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయాన్ని బాలిక వివరించినట్టు కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు. సంఘటనపై బాలిక తల్లిదండ్రులు రాయవరం పోలీసులను ఆశ్రయించారు. అయితే ప్రైవేటు పాఠశాలకు 7వ తరగతి వరకు మాత్రమే అనుమతులు ఉండగా వేరే పాఠశాలలో అడ్మిషన్‌ చూపించి విద్యార్థులకు టెన్త్‌ క్లాస్‌ తరగతులు చెబుతూ కరస్పాండెంట్‌ ఈ నిర్వాకానికి పాల్పడినట్టు సమాచారం. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపుతున్నారు. కేసు కూడా నమోదు చేస్తారని సమాచారం.

Updated Date - Jul 29 , 2025 | 12:37 AM