Share News

EAPCET Counseling : 7 నుంచి ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:44 AM

ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ను ఈనెల 7వ తేదీ నుంచి చేపట్టనున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్‌ జి. గణేష్ కుమార్ గురువారం వెల్లడించారు.

EAPCET Counseling : 7 నుంచి ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌

22న సీట్ల కేటాయింపు.. ఆగస్టు 4 నుంచి తరగతులు

అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ను ఈనెల 7వ తేదీ నుంచి చేపట్టనున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్‌ జి. గణేష్ కుమార్ గురువారం వెల్లడించారు. శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, విద్యార్థులు ఈనెల 7 నుంచి 16 వరకు రిజిస్ర్టేషన్‌ చేసుకుని, ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 7 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు. 10 నుంచి 18 వరకు విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని, 19న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 22న సీట్ల కేటాయింపు జరుగుతుందని, 23 నుంచి 26 వరకు విద్యార్థులు అడ్మిషన్‌ పొందిన కాలేజీలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని వవరించారు. ఆగస్టు 4 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ సమయంలో విద్యార్థులు ఫీజు చెల్లించిన రశీదు, ఈఏపీసెట్‌ ర్యాంకు కార్డు, హాల్‌ టిక్కెట్‌, పదో తరగతి, ఇంటర్మీడియట్‌ మార్కుల మెమోలు, 6 నుంచి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలన్నారు. సందేహాలుంటే 7995681678, 7995865456, 9177927677 హెల్స్‌ డెస్క్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Updated Date - Jul 04 , 2025 | 04:46 AM