Driver Jobs: విదేశాల్లో డ్రైవర్ ఉద్యోగాలు
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:14 AM
యూఏఈలో పనిచేసి తిరిగొచ్చిన వారికి దుబాయ్‌లో డ్రైవర్ ఉద్యోగాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ
యూఏఈ రిటర్నీలకు అవకాశం
అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): యూఏఈలో పనిచేసి తిరిగొచ్చిన వారికి దుబాయ్‌లో డ్రైవర్ ఉద్యోగాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ గణే్‌షకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం పంజాబ్‌కు చెందిన జలంధర్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి పనిచేస్తున్నామన్నారు. దుబాయ్‌లోని ట్రైస్టార్ గ్రూప్, వియోలీయ, అల్లైడ్ ట్రాన్స్‌పోర్ట్, దుబాయ్ పోర్ట్‌లలో ఉద్యోగావకాశాలు ఉన్నట్లు వివరించారు. కడప, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో యూఏఈ నుంచి తిరిగొచ్చిన డ్రైవర్లు ఎక్కువ ఉన్నట్లు తెలిపారు. ట్రైలర్ డ్రైవర్, ట్రక్ డ్రైవర్, ఐటీవీ డ్రైవర్ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్నవారు ఏపీ నైపుణ్యం వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9988853335ను సంప్రదించాలన్నారు.